- Telugu News Photo Gallery Cinema photos Actress Mrunal Thakur no more movie in tollywood after family star movie flop Telugu Heroine Photos
Mrunal Thakur: ఒక్క ప్లాప్ తో టాలీవుడ్ కి దూరమైన మృణాళ్ ఠాకూర్.! ఇక కష్టమేనా.?
ఒక్క ఫ్లాప్‌తో ముందొచ్చిన అన్ని హిట్స్‌ను మరిచిపోతారా.? ఒక్క డిజాస్టర్‌కు అంత పవర్ ఉంటుందా.? ఒకే ఒక్క సినిమా మిస్ ఫైర్ అయితే కనీసం సీన్‌లోనే కనిపించకుండా పోతారా.? దర్శకులైతే ఏమో అనుకోవచ్చు గానీ హీరోయిన్లకు ఈ సూత్రం పని చేస్తుందా.? ఎందుకు పనిచేయదు.? ఇక్కడ పని చేస్తుందిగా.. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.? మృణాళ్ ఠాకూర్‌ను చూస్తుంటే ఇప్పుడు ఈ స్యాడ్ సాంగ్సే గుర్తుకొస్తున్నాయి.
Updated on: Sep 15, 2024 | 5:31 PM

ఒక్క ఫ్లాప్‌తో ముందొచ్చిన అన్ని హిట్స్‌ను మరిచిపోతారా.? ఒక్క డిజాస్టర్‌కు అంత పవర్ ఉంటుందా.? ఒకే ఒక్క సినిమా మిస్ ఫైర్ అయితే కనీసం సీన్‌లోనే కనిపించకుండా పోతారా.?

దర్శకులైతే ఏమో అనుకోవచ్చు గానీ హీరోయిన్లకు ఈ సూత్రం పని చేస్తుందా.? ఎందుకు పనిచేయదు.? ఇక్కడ పని చేస్తుందిగా.. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా.?

మృణాళ్ ఠాకూర్‌ను చూస్తుంటే ఇప్పుడు ఈ స్యాడ్ సాంగ్సే గుర్తుకొస్తున్నాయి. సీతా రామం సినిమాతో మొదలైన ఈమె జర్నీ.. హాయ్ నాన్నతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

రెండు సినిమాలతోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ భామ. కానీ ఒక్క సినిమాతోనే మృణాళ్ జాతకం అంతా మారిపోయింది.

విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా నిరాశ పరచడంతో మృణాళ్ ఠాకూర్ జాతకం తిరగబడింది. ఆ తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదా లేదంటే మనోళ్లే ఈమెను పట్టించుకోవట్లేదా అనేది అర్థం కావట్లేదు.

ప్రస్తుతానికి ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అక్కడ ఒక్క హిట్టు కూడా లేకపోయినా.. మృణాళ్‌ను బాగానే ఆదరిస్తున్నారు. ఈ మధ్యే సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడానికి ఓకే అన్నారు మృణాళ్.

సిద్దాంత్ చతుర్వేది హీరోగా నటించబోయే ఈ చిత్రానికి రవి ఉద్యావర్ దర్శకుడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నారు. వీటి కోసమే సౌత్ సినిమాల వైపు చూడట్లేదు మృణాళ్. మరి ఈమె తీసుకుంటున్న ఈ నిర్ణయం కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.




