- Telugu News Photo Gallery Cinema photos Hero Nithiin very focused on his next two movies roobinhood and thammudu, details here Telugu Heroes Photos
Nithiin: గ్యాప్ వచ్చినా పర్లేదు.. హిట్ కొట్టాలన్న కసితో హీరో నితిన్.!
బ్యాడ్ టైమ్ బంతాట ఆడుతున్నపుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా.. ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కవుట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో.? వరసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్టైతే రావట్లేదు. అందుకే కాస్త టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో. మరింతకీ నితిన్ ఏం చేయబోతున్నారు.? నితిన్ కెరీర్ ప్లానింగ్ ఎక్కడో తేడా కొడుతుంది.
Updated on: Sep 15, 2024 | 6:26 PM

బ్యాడ్ టైమ్ బంతాట ఆడుతున్నపుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా.. ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కవుట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో.?

వరసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్టైతే రావట్లేదు. అందుకే కాస్త టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ.. కొడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో. మరింతకీ నితిన్ ఏం చేయబోతున్నారు.?

నితిన్ కెరీర్ ప్లానింగ్ ఎక్కడో తేడా కొడుతుంది. మంచి డైరెక్టర్లు పడుతున్నారు.. క్రేజీ బ్యానర్స్‌లోనే సినిమాలు చేస్తున్నారు కానీ అవి మాత్రం వర్కవుట్ అవ్వట్లేదు.

కరోనా టైమ్‌లో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ హీరోకు. మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, చెక్, రంగ్ దే, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ అంటూ చాలా చేసారు కానీ ఏదీ హిట్ కాలేదు.

ఏడాదికి రెండు సినిమాలు చేయడం కంటే.. రెండేళ్ళు టైమ్ తీసుకునైనా మంచి సినిమా చేయాలనేది నితిన్ ప్లాన్ ఇప్పుడు. అందుకే గ్యాప్ ఎక్కువైనా పర్లేదు.. హిట్ పక్కాగా కొట్టాల్సిందే అనే కసితో ఉన్నారీయన.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు.. భీష్మ ఫేమ్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ సినిమాలు చేస్తున్నారు నితిన్. తమ్ముడు, రాబిన్ హుడ్ షూటింగ్స్ చివరిదశకు వచ్చేసాయి. దాంతో నెక్ట్స్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు నితిన్.

తన సెకండ్ ఇన్నింగ్స్‌కు పునాది వేసిన ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నారు నితిన్. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ ఫ్లాప్ రాకుండా ఉంటే చాలంటున్నారు నితిన్.




