- Telugu News Photo Gallery Cinema photos Director Prasanth varma jai hanuman movie shooting update on September 2024 Telugu Cinema posters
Jai Hanuman Movie: జై హనుమాన్ సినిమా ఏమైంది.. ఇదిగో క్లారిటీ.! ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నారు..
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు. అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. మరిలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితేంటి.? అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి.? హనుమాన్.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.
Updated on: Sep 15, 2024 | 7:46 PM

ఇప్పటికే ఈ యూనివర్స్‌లో రెండు ప్రాజెక్ట్స్ ఎనౌన్స్ అయ్యాయి. ఆ సినిమాలను ప్రశాంత్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా పీవీసీయులో మరో మూవీని ప్రకటించారు.

దర్శకుడిగా, రచయితగా నిర్మతగానూ బిజీగా ఉన్నారు. దీంతో ఆ సినిమా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ సినిమాతో సూపర్ హీరో యూనివర్స్‌ను స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ, ఆ సిరీస్‌లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా అప్‌డేట్స్ లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ప్రశాంత్ వర్మ పేరు ట్రెండ్ అవుతూనే ఉంది. వరుసగా మెగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన ఈ యంగ్ డైరెక్టర్.

మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమే. మోక్షు సినిమా అనౌన్స్‌మెంట్ రావడంతో.. జై హనుమాన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.

నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన సినిమా జై హనుమానే. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

తాను డైరెక్ట్ చేయకపోయినా.. నిర్మాతగా కథను అందిస్తూ మహాకాళీ పేరుతో సూపర్ విమెన్ కథను తెర మీదకు తీసుకువస్తున్నారు.

అలాగే బాలీవుడ్‌లోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎలాగూ ఉంది. మొత్తమ్మీద జై హనుమాన్ కంటే ముందు.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం 3 సినిమాలు రానున్నాయి.




