Watch: మత్స్యకారులతో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు.. నడి సముద్రంలో మంటల్లో దగ్ధం..
బోటులో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. సుమారు 10 వేటకన్ మైళ్ల దూరంలో అనుకోకుండా బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలోకి దూకిన వీరిని సమీపంలో ఉన్న ఐఎన్ డి- ఎపి- వి5-ఎంఎం-894 బోటిలో ఉన్న సిబ్బంది గుర్తించి వారిని మరో బోటులో..
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కు చెందిన బోటు వేటకు వెళ్లి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. సముద్రంలో వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. మత్స్యకారులతో బయల్దేరిన బోటు నడి సముద్రంలోకి వెళ్లగానే మంటలు చెలరేగాయి. బోటు నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాడానికి గురైన బోటులో మత్స్యకారులు సహా 8మంది ఉన్నట్టుగా తెలిసింది. సిబ్బంది వెంటనే సమీపంలో ఉన్న బోట్లకు సమాచారం అందించారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 8మంది సురక్షితంగా బయటపడ్డారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ ఉదయం చేపల వేటకు వెళ్లిన IND AP V5 MM 495 నెంబరు గల బోటులో ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. సుమారు 10 వేటకన్ మైళ్ల దూరంలో అనుకోకుండా బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని గుర్తించిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలోకి దూకిన వీరిని సమీపంలో ఉన్న ఐఎన్ డి- ఎపి- వి5-ఎంఎం-894 బోటిలో ఉన్న సిబ్బంది గుర్తించి వారిని మరో బోటులో ఎక్కించుకొని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల విలువైన బోటు దగ్ధమైంది.
ఈ వీడియో చూడండి..
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు ప్రమాదంపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఐదుగురు మత్స్యకారులూ సురక్షితంగా ఉన్నారని విశాఖ మత్స్య శాఖ అధికారి విజయ తెలిపారు. ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన పెంచాలని సూచించిన మంత్రి అచ్చెన్నాయుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..