అయ్యో.. పాపం.. ఇదెక్కడి కర్మ రా దేవుడా! గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి..

పోటీలో అత్యధికంగా ఇడ్లీలు తిని గెలవాలని అందరూ పోటీ పడ్డారు. ఈసారి ఏకంగా మూడు ఇడ్లీలు తినేందుకు సురేష్ ప్రయత్నించాడు. ఈ ఇడ్లీలు అతని గొంతులో ఇరుక్కుపోవడంతో సురేష్‌కి నొప్పి మొదలైంది. ఆ తర్వాత వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అయ్యో.. పాపం.. ఇదెక్కడి కర్మ రా దేవుడా! గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి..
Idli Stuck In Throat Youth
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2024 | 9:43 PM

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలో ఓనం పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కంజికోడ్ గ్రామంలో కొందరు యువకులు ఇడ్లీ తినే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి ఇడ్లీ తినేందుకు పోరాడుతూ చనిపోయాడు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేపడంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంజికోడ్ గ్రామానికి చెందిన యువకులు ఇడ్లీ తినే పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలంరం పాలక్కాడ్‌కు చెందిన 50 ఏళ్ల సురేష్‌ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో అత్యధికంగా ఇడ్లీలు తిని గెలవాలని అందరూ పోటీ పడ్డారు. ఈసారి ఏకంగా మూడు ఇడ్లీలు తినేందుకు సురేష్ ప్రయత్నించాడు. ఈ ఇడ్లీలు అతని గొంతులో ఇరుక్కుపోవడంతో సురేష్‌కి నొప్పి మొదలైంది. ఆ తర్వాత వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

రోగి పరిస్థితి విషమంగా ఉండడంతో వాలర్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలో ఉంచారు. పోలీసులు అసహజ మరణంగా నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఓ వైపు ఓనం సందడి మధ్య జరిగిన ఈ ఘటన సర్వత్రా దుమారం రేపుతోంది. సురేష్ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..