సాలీడు కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లగా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన వైద్యులు..! ఏం జరిగిందంటే..
కానీ, స్పైడర్ కాటు గుర్తు క్రమంగా పెద్దదవడం ప్రారంభించింది. ఆపై నొప్పి కూడా పెరిగింది. తాను సెలవుల్లో ఈజిప్ట్ బయల్దేరేందుకు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని నిగెల్ చెప్పారు. విమానాశ్రయంలోనే తాను బ్యాగ్‌పై తల పెట్టుకుని నిద్రపోయాడట. ఆ క్రమంలోనే అతని ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వెంటనే నేరుగా ఆస్పత్రికి వెళ్లానని చెప్పాడు.
సాలీడు కాటుకు గురైన వ్యక్తి జీవితం కష్టాల్లో పడింది. ఆసుపత్రికి వెళ్లటం మరి కాస్త ఆలస్యమై ఉంటే.. అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఎదురైంది. సాలీడు కుట్టిన వ్యక్తి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇక అతన్ని పరీక్షించిన వైద్యులు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. సమయానికి అతన్ని ఆస్పత్రిలో చేర్పించారంటూ వైద్యులు అతనికి చికిత్స అందజేశారు. అయితే, ఆ వ్యక్తిని సాలీడు కరిచిన చోట గాయం క్రమ క్రమంగా పెరుగుతూ పోయిందని, అందుకే వెంటనే అత్యవసరంగా అతన్ని ఆసుపత్రిలో చేర్పించారట. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
నిగెల్ అనే ఓ వ్యక్తి కడుపుపైసాలీడు కాటు వేసింది. నిగెల్ ఈజిప్ట్‌కు సెలవుపై వెళ్లాల్సి ఉండగా, ఇంట్లో మంచంపై పడుకున్నప్పుడు సాలీడు కాటు వేసింది. 59 ఏళ్ల నిగెల్‌కి మొదట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, స్పైడర్ కాటు గుర్తు క్రమంగా పెద్దదవడం ప్రారంభించింది. ఆపై నొప్పి కూడా పెరిగింది. తాను సెలవుల్లో ఈజిప్ట్ బయల్దేరేందుకు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని నిగెల్ చెప్పారు. విమానాశ్రయంలోనే తాను బ్యాగ్‌పై తల పెట్టుకుని నిద్రపోయాడట. ఆ క్రమంలోనే అతని ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో వెంటనే నేరుగా ఆస్పత్రికి వెళ్లానని చెప్పాడు.
తనకు జరిగిన విషయం డాక్టర్‌కి చెప్పగా వెంటనే తనకు బ్లడ్ టెస్ట్ చేశారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాడు. కొంత సేపటికే..వైద్యులు నువ్వు ఇక్కడికి రావడం మంచిదైందని చెప్పారు. నన్ను కాటు వేసింది సాలీదు కాదు.. మాంసాన్ని తినే పురుగు అయిన నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌తో బాధపడుతున్నానని వైద్యులు వెల్లడించారు. NHS వెబ్‌సైట్ ప్రకారం, నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అనేది అరుదైన, ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్, దీంతో శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు తక్షణమే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుదని చెప్పారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని బాధిత నిగెల్ వెల్లడించారు.
లేదంటే,.. ఆరు నుండి 10 రోజులలోపు ఆసుపత్రికి వెళ్లకపోతే తాను చనిపోయి ఉండేవాడిని అని నిగెల్ చెప్పాడు. తనకు అయిన గాయం ఎప్పుడు మానిపోతుందో కూడా వైద్యులు చెప్పలేదన్నాడు. గాయం ఇంకా పెద్దదిగా, మరింతగా విస్తరిస్తోందని చెప్పాడు. తరువాత రెండు రోజులకోసారి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని, హాలీడేస్ టూర్ ప్లాన్ చేసుకున్నాను కానీ, ఇప్పుడు నేను ఇంటి నుండి బయటకు రాలేకపోతున్నాను అని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..