AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఓలాపై యువతి వినూత్న నిరసన.. స్పందించిన సంస్థ ఏం చేసిందటే

వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను వ్యక్తపరచడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగా లేకపోతే ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి షోరూమ్‌కు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే...

Viral News: ఓలాపై యువతి వినూత్న నిరసన.. స్పందించిన సంస్థ ఏం చేసిందటే
Ola
Narender Vaitla
|

Updated on: Sep 16, 2024 | 8:45 AM

Share

వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను వ్యక్తపరచడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగా లేకపోతే ఫిర్యాదు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి షోరూమ్‌కు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ చర్య చట్ట విరుద్దమని తెలిసిందే. తాను కొనుగోలు చేసిన ఓలా బైక్‌కు మరమ్మతులు చేయించి ఇవ్వడం లేదని కలబురగిలో వినియోగదారుడు చేసిన ఈ పని దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ పని చేసిన తర్వాత అతను పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా తాజాగా మరో ఓలా కస్టమర్‌ తన నిరసనను వినూత్నంగా వ్యక్త పరిచారు. తాను కొనుగోలు చేసుకున్న స్కూటర్‌ ప్రతిసారీ పాడవుతున్నా ఓలా సంస్థ స్పందించడం లేదని ఒక యువతి ఆరోపించింది.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, సంస్థ ప్రతినిధులు స్కూటర్‌ను రిపేర్‌ చేయడం లేదని ఆరోపించింది. అయితే ఇందుకోసం ఆమె ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఆవేదదను వ్యక్తపరుస్తూ ఓ కాగితంపై రాసి దానిని స్కూటీపై అతికించింది. ఈ ఫొటోను సోషల్‌ మీడియా సైట్ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

దీంతో ఈ పోస్ట్‌ కాస్త చివరికి ఓలా దృష్టిలో పడింది. దీంతో సంస్థ ప్రతినిధులు స్పందించారు. వాహనాన్ని రిపేర్‌ చేసేందుకు తీసుకువెళుతూ, అప్పటి వరకు నడుపుకొనేందుకు ఆమెకు తాత్కాలికంగా ఒక వాహనాన్ని అందించి వెళ్లారు. వరుసగా జరుగుతోన్న ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి..