AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Ration Cards: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ అప్పటినుంచే.. రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన

ప్రజా పరిపాలన మార్క్‌తో మరో మార్పునకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన వారందరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డు, స్మార్ట్‌ హెల్త్‌ కార్డు జారీ చేస్తామని కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రకటించింది. ఇక దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్‌ నుంచి ప్రారంభం కానుంది.

New Ration Cards: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీ అప్పటినుంచే.. రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 13, 2025 | 9:08 PM

Share

తెలంగాణలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన చేసింది.. ప్రజా పరిపాలన మార్క్‌తో మార్పునకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. అర్హులైన వారందరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డు, స్మార్ట్‌ హెల్త్‌ కార్డు జారీ చేస్తామని ప్రకటించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో నాల్గోసారి సమావేశమైన కేబినెట్‌ సబ్‌ కమిటీ సోమవారం పలు కీలక అంశాలను ప్రకటించింది. అక్టోబర్‌లో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రకటించారు. వీలైనంత త్వరగా కార్డులను జారీ చేయడం సహా జనవరి నుంచి రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనతో తెలంగాణలో ఇది మరో విప్లవమాత్మకమైన మార్పు మార్క్‌ అంటూ పేర్కొన్నారు..

గత ప్రభుత్వంలో కేవలం 49వేల 476 రేషన్లు కార్డులు మాత్రమే ఇచ్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. అదీ కూడా ఉప ఎన్నికలు జరిగిన నియోజవర్గాల్లో మాత్రమే జారీ చేశారన్నారు.అర్హులైన వాళ్లందరికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, స్మార్ట్‌ హెల్త్‌కార్డులు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ కార్డులు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అధ్యయనం చేశామన్నారు మంత్రి ఉత్తమ్‌. విధివిధానాల రూపకల్పనలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు లేఖ రాశామన్నారు. కొందరి నుంచి సూచనలు వచ్చాయన్నారు.

రాజకీయాలకు అతీతంగా సూచనలు , సలహాలను తప్పక స్వీకరిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. ఈ 19లోగా ప్రజాప్రతినిధులు తమ సలహాలు సూచనలు ఇవ్వొచ్చన్నారు.21న మరోసారి సమావేశమై ఈ నెలఖారుకల్లా విధి విధానాలను ఖరారు చేస్తామన్నారు.

పేద, మధ్యతరగతి వర్గాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి స్మార్ట్‌ రేషన్‌ కార్డ్‌, స్మార్ట్‌ హెల్త్‌ కార్డ్‌ అందుంతని భరోసానిచ్చారు. అందరి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని ఈ నెలఖారు కల్లా కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదిక ఇవ్వనుంది. విధివిధానాలను ఖరారు చేశాక కొత్త రేషన్‌, హెల్త్‌ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆదిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అధికార యంత్రం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..