Viral Video: కారు బానెట్ ఓపెన్ చేసిన మెకానిక్‌కు షాక్.. లోపల ఏం ఉందో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెస్క్యూ ఆపరేషన్‌ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. పాము రెస్క్యూ ఆపరేషన్‌ను చూసేందుకు చాలా మంది వ్యక్తులు సంఘటన స్థలంలో గుమిగూడడం కూడా వీడియోలో కనిపించింది.
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. చెట్లు, పుట్టలు, పొదలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో పాములు, తేల్లు వంటివి వెచ్చదనాన్ని వెతుక్కుంటూ ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ కొండచిలువ ఒకటి కారు బ్యానెట్‌లో దూరింది. మరమ్మతుల కోసం గ్యారేజీ లోపల పార్క్ చేసిన కారు బ్యానెట్ ఓపెన్ చేసి చూడగా..భారీ కొండచిలువ కనిపించడంతో మెకానిక్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే గ్యారేజీ యజమానికి ఫోన్ చేశాడు. మరోవైపు అటవీ శాఖ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని గ్యారేజీలో కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించింది. మరమ్మతుల కోసం గ్యారేజీ లోపల పార్క్ చేసిన కారు బానెట్‌ని తెరిచి చూడగా.. భారీ కొండచిలువ కనిపించడంతో మెకానిక్ షాక్‌కు గురయ్యాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు వచ్చి పామును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్‌లైన్స్‌లోని హోటల్ అజయ్ ఇంటర్నేషనల్ వెలుపల గ్యారేజీలో ఈ ఘటన జరిగింది. మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ బానెట్‌లో కొండచిలువ రెస్ట్ తీసుకుంటూ కనిపించింది. మెకానిక్ ఎస్‌యూవీ బానెట్‌ను తెరిచి చూడగా 7 అడుగుల భారీ కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. వెంటనే గ్యారేజీ యజమాని 112కు ఫోన్ చేసి అటవీశాఖకు సమాచారం అందించారు. అటవీశాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ వీడియో చూడండి..
प्रयागराज : कार का बोनट खोलने पर निकला विशालकाय अजगर
➡गैराज में अजगर देखते ही लोगों में मची अफरा-तफरी ➡मौके पर पहुंची रेस्क्यू टीम ने अजगर को पकड़ा ➡अजय इंटरनेशनल के सामने स्थित गैराज का मामला.#Prayagraj pic.twitter.com/JaYobafFKk
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) September 14, 2024
రెస్క్యూ ఆపరేషన్‌ను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. పాము రెస్క్యూ ఆపరేషన్‌ను చూసేందుకు చాలా మంది వ్యక్తులు సంఘటన స్థలంలో గుమిగూడడం కూడా వీడియోలో కనిపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..