Video Viral: క్యాసీన్ హై!.. బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. కారణం ఏంటంటే..

గతంలోనూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పట్టాలపై రైల్ కోచ్‌ని కొందరు ప్రయాణికులు, సిబ్బంది కలిసి ముందుకు తోస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో

Video Viral: క్యాసీన్ హై!.. బస్సును నెట్టినట్లు రైలును తోస్తున్న ఉద్యోగులు, సిబ్బంది.. కారణం ఏంటంటే..
Employees Push Train Engine
Follow us

|

Updated on: Sep 16, 2024 | 6:13 PM

పట్టాలపై ఆగిపోయిన ఓ రైలును కొంతమంది రైల్వే సిబ్బంది, ఉద్యోగులు, స్థానికులు కలిసి ముందుకు తోస్తున్నారు. కొంతదూరం నెట్టిన తరువాత అది స్టార్ట్‌ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ ప్రాంతంలో రైల్వే కార్మికులు బ్రేక్ డౌన్ అయిన రైలును కొద్ది దూరం వరకు నెడుతూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి.. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు.. తరచూ ఇలాంటి సంఘటనలు ఎదురుకావటం పరిపాటిగా మారిందంటూ రాసుకొచ్చారు.

ఈ వీడియో చూడండి..

గతంలోనూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పట్టాలపై రైల్ కోచ్‌ని కొందరు ప్రయాణికులు, సిబ్బంది కలిసి ముందుకు తోస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పట్లో ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు. రైల్వే సిబ్బంది, నిర్వాహణపై భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తూ కామెంట్ల వర్షం కుమ్మరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..