ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రూ. 99కే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం.!
రూ.99కే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం.. ఏంటి.! వార్త వినగానే షాక్ అవుతున్నారా.. నిజమండీ బాబూ.. ఫ్లిక్స్ బస్ సర్వీసుల గురించి మీరు వినే ఉంటారు. ఆ వివరాలు ఇలా..
రూ.99కే హైదరాబాద్ టూ బెంగళూరు ప్రయాణం.. ఏంటి.! వార్త వినగానే షాక్ అవుతున్నారా.. నిజమండీ బాబూ.. సాధారణంగా హైదరాబాద్ టూ బెంగళూరు బస్సులో ప్రయాణించాలంటే.. కచ్చితంగా రూ. 1500 ఖర్చు చేయాల్సిందే. ట్రైన్ అయితే రూ.500 వరకు పడుతుంది. కానీ ఫ్లిక్స్ బస్సు సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద హైదరాబాద్ టూ బెంగళూరు జర్నీ టికెట్‌ను రూ.99కే ఫిక్స్ చేసింది. ఫ్లిక్స్ బస్ సర్వీసుల గురించి మీరు వినే ఉంటారు. జర్మన్ బ్రాండ్ ఫ్లిక్స్ బస్ తక్కువ ధరకే సుమారు 40 దేశాల్లో 4 లక్షల రూట్లలో సర్వీసులను అందిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఫ్లిక్స్ బస్ బ్రాండ్‌ను విస్తరించే క్రమంలో ఈ రూ. 99 ఆఫర్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే ఫ్లిక్స్ బస్ సంస్థ బెంగళూరు టూ చెన్నై, బెంగళూరు టూ హైదరాబాద్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. చెన్నై, హైదరాబాద్‌తో పాటు బెంగళూరు నుంచి మరో 31 నగరాలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది ఫ్లిక్స్ బస్ సంస్థ. బెంగళూరు, చెన్నైతో పాటు కోయంబత్తూర్, మధురై, తిరుపతి, విజయవాడ, బెళగావి లాంటి నగరాలకు కూడా బస్సు సర్వీసులను పొడిగించింది ఫ్లిక్స్ బస్ సంస్థ. ఈ సందర్భంగా రూ. 99కే టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాలని.. అలాగే ప్రయాణ తేదీలు సెప్టెంబర్ 11- అక్టోబర్ 6 మధ్య ఉండాలని పేర్కొంది. ప్రస్తుతానికి 6 బస్సు ఆపరేటర్స్‌తో అనుసంధానమైన ఫ్లిక్స్ బస్సు.. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో 33 నగరాలకు విస్తరించనుంది ఫ్లిక్స్ బస్సు.