AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG DSC 2024 Result Date: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! నేడు తుది ఆన్సర్‌ కీ విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలవగా.. ఈ రోజు తుది కీ విడుదల అవనుంది. ఈ మేరకు డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల తుది కీ విడుదలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మరోసారి చెక్‌ చేసేందుకు..

TG DSC 2024 Result Date: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌! నేడు తుది ఆన్సర్‌ కీ విడుదల
TG DSC 2024 Result Date
Srilakshmi C
|

Updated on: Sep 04, 2024 | 2:00 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీ విడుదలవగా.. ఈ రోజు తుది కీ విడుదల అవనుంది. ఈ మేరకు డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షల తుది కీ విడుదలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మరోసారి చెక్‌ చేసేందుకు తెలంగాణ ఆన్‌లైన్‌కు పంపారు. తుది ఆన్సర్‌ కీ విడుదలైన తర్వాత పరీక్ష రాసిన అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమకు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. తుది కీ ప్రకటన తర్వాత రెండు మూడు రోజుల్లో డీఎస్సీలో 80 మార్కులకు టెట్‌ వెయిటేజీ 20 మార్కులను కలిపి.. వంద మార్కులకు వచ్చిన ర్యాంకులను జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టును విడుదల చేస్తారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. ఆన్‌లైన్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీలను ఆగస్టు 13న విడుదల చేయగా.. ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించారు. డీఎస్సీలో అడిగిన ప్రశ్నలపై దాదాపు 28 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చాయి. దీంతో తుది కీలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు మారుతాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ముందుగా అనుకున్నట్లుగానే పరీక్షల తుది కీ బుధవారం (సెప్టెంబరు 4న) విడుదల చేస్తే.. రెండు, మూడు రోజుల్లోనే టెట్‌ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టును విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా తయారు చేసి ప్రకటిస్తారు. ఫలితాలు విడుదలయ్యాక డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన చూపడతారు. అనంతరం మెరిట్‌ ప్రాతిపదికన నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.