Telangana: వారెవ్వా.. చేప రుచి చూడాల్సిందే.. ప్రారంభమైన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్..
Fish Food Festival in Telangana: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకొని మూడు రోజుల పాటు (8,9,10 తేదీలలో) ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు.
Fish Food Festival in Telangana: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకొని మూడు రోజుల పాటు (8,9,10 తేదీలలో) ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఊరూరా చెరువుల పండుగను నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌లో భాగంగా చేపలు, రొయ్యలతో తయారు చేసిన ప్రై, కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంచారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను హైదరాబాద్ నగర పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం ఏర్పాటు చేయగా.. దీనిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా స్థాయిలో సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక మహిళా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. అనంతరం చేపలు, రొయ్యలతో చేసిన వంటకాల రుచులను ఆస్వాదించారు.
మతసామరస్యానికి ప్రతీక..
నిజామబాద్ జిల్లా బోధన్‌లో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎడపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. వేసవి కాలంలో కూడా తెలంగాణలో చెరువులు నిండుగా ఉన్నాయన్నారు కవిత. సీఎం కేసీఆర్ దూరదృష్టి తోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. చెరువు కట్టమైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యకర్తలతో కలిసి డాన్స్ చేశారు కవిత.
తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు కవిత. ఊరూరా చెరువుల పండుగలో అన్ని మతాల వాళ్లు పాల్గొనడం ఇందుకు నిదర్శనమన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..