AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. జూన్‌ 14 నుంచి ధ్రువ పత్రాల పరిశీలన

తెలంగాణల ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి పనులను తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. తదుపరి దశలో ధ్రువీకరణ పత్రాలను..

TSLPRB: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. జూన్‌ 14 నుంచి ధ్రువ పత్రాల పరిశీలన
TSLPRB
Srilakshmi C
|

Updated on: Jun 08, 2023 | 3:00 PM

Share

తెలంగాణల ఎస్సై, కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇందుకు సంబంధించి పనులను తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వేగవంతం చేసింది. తుది రాత పరీక్షల ఫలితాలను ఇటీవల బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. తదుపరి దశలో ధ్రువీకరణ పత్రాలను జూన్ 14 నుంచి 26వ తేదీ వరకు పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది (హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, సిద్దిపేట, రామగుండం, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌).

ప్రతి కేంద్రానికి అదనపు ఎస్పీ/అదనపు డీసీపీ స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించింది. ఆ హోదా అధికారి అందుబాటులో లేనిపక్షంలో సంబంధింత యూనిట్‌ ఎస్పీ ఆ ప్రక్రియ చూసుకోవాలని సూచించింది. మొత్తం 14 నుంచి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనుంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం కటాఫ్‌ మార్కులను ప్రకటించనుంది. దీంతో తుదిఎంపికలో కటాఫ్‌ మార్కులు కీలకం కానున్నాయి. జిల్లా, కంటీజియస్‌ డిస్ట్రిక్ట్‌(పొరుగునే ఉండే జిల్లా), జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయుల్లోని ఖాళీలను పరిగణనలోకి తీసుకోనున్నారు.

కాగా తుది ఫలితాల్లో 1,50,852 మందిని అర్హులుగా గుర్తించారు. ఒకటికంటే ఎక్కువ పరీక్షల్లో అర్హత సాధించినవారు ఉండటంతో మొత్తం అర్హుల సంఖ్య సుమారు 1.09 లక్షల మందిగా తెలింది. ఈ లెక్కన మొత్తం 17,516 పోస్టుల కోసం సగటున ఆరుగురు చొప్పున పోటీపడుతున్నట్లు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!