Mulugu Ramalingeswara: ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండితులు.. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు.

Mulugu Ramalingeswara: తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం చెందారు. అనారోగ్యం కార‌ణంగా ఆదివారం

Mulugu Ramalingeswara: ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండితులు.. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇక లేరు.
Mulugu
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2022 | 9:03 PM

Mulugu Ramalingeswara: తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం చెందారు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉంద‌ని సిద్ధాంతి అన‌డంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.  అయితే ఆసుప‌త్రికి చేరుకునే లోపే రామ‌లింగేశ్వర సిద్ధాంతి మార్గ‌మ‌ద్యంలో తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.

టీవీ ప్రోగ్రామ్‌లో వార ఫ‌లాలు చెబుతూ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఎంతో మందికి చేరువ‌య్యారు. ఈయ‌న చెప్పే రాశి ఫలాల‌ను కేవ‌లం తెలుగు రాష్ట్రాల వారే కాకుండా విదేశాల్లో ఉంటే తెలుగు వారు కూడా ఎంత‌గానో విశ్వ‌సిస్తుంటారు.

దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ చేసిన ములుగు సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. ములుగు సిద్ధాంతి.. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వ‌హించారు. ఇదిలా ఉంటే ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవితాన్ని ప్రారంభించేకంటే ముందు సిద్ధాంతి ఎమ్ఆర్ ప్ర‌సాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంత‌ర్జాతీయంగా ఖ్యాతి గ‌డించారు. సీనీ న‌టులు ఏవీఎస్‌, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.

Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆస‌క్తిక‌రంగా భామా క‌లాపం టీజర్‌..

Rakul Preet Singh with mom: రోడ్లపై అమ్మతో చక్కర్లు కొడుతున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ఫొటోస్

Mahesh Babu: ఈ సంక్రాంతి కుదర్లేదు.. కానీ వచ్చే సంక్రాంతి బరిలో మహేష్ సినిమా పక్కా అంటున్నారే..