Dump at Farm Land: వ్యవసాయ బావి వద్ద గొయ్యి.. అనుమానంతో తవ్వీ చూసిన పోలీసులు షాక్!
పుర్రెకో బుద్ధి.. జువ్వకో రుచి అన్నట్లు.. తప్పించుకునేందుకు సవాలక్ష మార్గాలు ఉంటాయని తాజాగా జరిగిన ఓ ఘటన రుజువు చేసింది.
Natsara Raw Material dump: పుర్రెకో బుద్ధి.. జువ్వకో రుచి అన్నట్లు.. తప్పించుకునేందుకు సవాలక్ష మార్గాలు ఉంటాయని తాజాగా జరిగిన ఓ ఘటన రుజువు చేసింది. ఎక్కడైనా నాటు సారాను, సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని డబ్బాల్లో , టిన్నుల్లో, డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ చేయడం చూశాం. కానీ, నాగర్ కర్నూల్ జిల్లాలో నాటు సారా తయారికి ఉపయోగించే ముడి పదార్ధాల్ని భూమిలో గొయ్యి తొవ్వి అందులో నిల్వ చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు తవ్వీ చూడటంతో అసలు బండారం బయటపడింది.
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరులో అక్రమ డంప్ బయటపడింది. భూమిలో దాచినట్లుగా నాటుసారా పెద్ద డంప్‌ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన డంపులో 75 సంచుల నల్ల బెల్లం రెండు సంచుల పటికను స్వాధీనం చేసుకున్నారు. వెల్టూరులోని సూర్య తండకు చెందిన హతిరామ్ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమలో నాటుసారా తయారికి ఉపయోగించే పదార్ధాల డంప్‌ని భూమిలో పాతిపెట్టినగా పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు… పోలీసుల సహాయంతో ఘటన స్తలానికి చేరుకొని పరిసరాల్ని పరిశీలించారు. ముందు పొలం చుట్టుపక్కల తనిఖీలు చేసిన పోలీసులు ఎక్కడా నాటుసారా బెల్లం, పటిక నిల్వ చేసినట్లుగా దొరక్కపోవడంతో.. వ్యవసాయ భూమిలో ఓ పక్కన గొయ్యి తొవ్వి దానిపై నల్లటి పట్టా వేసినట్లుగా ఉండటాన్ని గమనించారు పోలీసులు.
గొయ్యిని తొవ్వి అందులోకి దిగడంతో సారా డంప్ బయటపడింది. డంప్‌లో దాచిపెట్టిన 75సంతుల నల్లబెల్లం, రెండు సంచుల పటికను బయటకు తీయించారు పోలీసులు. వాటిని ట్రాక్టర్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రైతు హత్తి రామ్ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన డంపును గుర్తించి బయటకు తీసిన 75 సంచుల గుడుంబా బెల్లంతో పాటు రెండు సంచుల పటికను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు ఉప్పునుంతల పోలీసు సిబ్బంది.
Read Also… Turmeric Milk: పసుపు పాలు తాగితే ఏమవుతుంది…? ఎలాంటి ప్రయోజనాలు..!