Turmeric Milk: పసుపు పాలు తాగితే ఏమవుతుంది…? ఎలాంటి ప్రయోజనాలు..!

Turmeric Milk: ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు నిరోనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు..

Turmeric Milk: పసుపు పాలు తాగితే ఏమవుతుంది...? ఎలాంటి ప్రయోజనాలు..!
Follow us

|

Updated on: Jan 24, 2022 | 5:58 AM

Turmeric Milk: ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు నిరోనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా పాత కాలపు అలవాట్లను మళ్లీ పాటిస్తున్నారు జనాలు. అయితే నిగనిరోధక శక్తి పెంచే పదార్థాలు చాలా ఉన్నాయి. రోజూ పాలు తాగే అలవాటు ఉన్నవారు కాస్త పసుపును జోడించినట్లతే మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి

రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. అలాంటి మంచి గుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి ఇంకా అదనపు ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు. తాగా కరోనా నేపథ్యంలో ఆ అలవాట్లను పాటిస్తున్నారు.

దగ్గు, జలుబుతో బాధపడేవారు..

దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారికి వెచ్చిన పసుపు పాలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు. పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలటోనిన్‌ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దాని వల్ల హాయిగా నిద్ర పడుతుంది.

పసుపు పాలతో మరిన్ని ప్రయోజనాలు..

► రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.

► పసుపు పాలు వైరల్‌ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. అందుకే కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.

► ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.

► పసుపు పాలలో కాలేయంలో చేరే విషకారకాలను హరింపజేసే గుణాలున్నాయి.

► పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగు పరిచి లింఫోటిక్‌ సిస్టమ్‌ను కూడా శుద్ధి పరుస్తాయి.

► పసుపులో ఉండే కర్‌క్యుమిన్‌ శరీరంలో వైరస్‌ వృద్ధిని అరికడుతుంది

► రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది

►నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్‌ త్వరితగతిన రెట్టింపు కాకుండా ఉంచే గుణాలు పసుపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Vitamin D Side Effect: విటమిన్ డి అతిగా తీసుకుంటున్నారా? అయితే, ఈ సైడ్‌ ఎఫెక్ట్స్ గరించి ఇప్పుడే తెలుసుకోండి..

Work From Home: ఇంటి నుంచి పని చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..