AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: సరిగా తినకున్నా బరువు పెరుగుతారా.. అప్పుడు ఏం చేయాలి..

చాలా మంది ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ సరిగా తిండి తినకపోయినా కూడా బరువు పెరుగుతారు...

Weight Loss Tips: సరిగా తినకున్నా బరువు పెరుగుతారా.. అప్పుడు ఏం చేయాలి..
Weight Loss
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 23, 2022 | 4:26 PM

చాలా మంది ఎక్కువగా తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ సరిగా తిండి తినకపోయినా కూడా బరువు పెరుగుతారు. శరీరానికి సరిపడా ఆహారం తీసుకోకపోతే మీ మెదడులో ఇప్పటికే ఉన్న కొవ్వు నిల్వలను ఎక్కువగా ఖర్చు చేయదు. జీవ క్రియలూ మందగిస్తాయి. దాంతో కెలొరీలు ఖర్చు కావు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఆహారం మానేయకుండా పోషకభరితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి.

త్వరగా బరువు తగ్గాలని మితి మీరి వర్కవుట్లు చేస్తే అనారోగ్యాల బారిన పడతారు. కాబట్టి క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్ర పోకపోతే జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నిద్రలేమి వల్ల కూడా బరువు పెరుగుతారని పరిశోధనలు చెబుతున్నాయి. రోజులో కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఆహారం మీద నియంత్రణ తెచ్చుకోవాలి. ఆకలిని పెంచే జ్యూస్‌లు, కెలొరీలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలు తీసుకోవద్దు. వీటికి ప్రత్యామ్నాయంగా నీళ్లు తాగండి. పోషకాలుండే ఆహారం అదీ మితంగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉండే బియ్యం, చక్కెర, బ్రెడ్‌ లాంటివి వీలైనంత వరకు తగ్గించాలి. వీటి నుంచి అందే పోషకాలు తక్కువ.

అలాగే ఎక్కువ మొత్తంలో గ్లైసిమిక్‌ లభ్యమవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను పెంచి బరువు తగ్గకుండా అడ్డుకుంటుంది. బరవు తగ్గడానకి మాత్రలు వొడడం మంచిది కాదు.

Read Also.. Corona Third Wave: కరోనా నుంచి కోలుకున్నారా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అవి ఏమిటంటే..