Vitamin D Side Effect: విటమిన్ డి అతిగా తీసుకుంటున్నారా? అయితే, ఈ సైడ్‌ ఎఫెక్ట్స్ గరించి ఇప్పుడే తెలుసుకోండి..

Vitamin D Side Effect: విటమిన్ డి అతిగా తీసుకుంటున్నారా? అయితే, ఈ సైడ్‌ ఎఫెక్ట్స్ గరించి ఇప్పుడే తెలుసుకోండి..

Vitamin D Side Effect: విటమిన్ డి ని 'సన్‌షైన్' విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది.

Shiva Prajapati

|

Jan 23, 2022 | 2:23 PM

Vitamin D Side Effect: విటమిన్ డి ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తుంది. మనలోని రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాల కణాల అభివృద్ధికి దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రస్తుత కరోనా కాలంలో ‘డి విటమిన్’ పాత్ర ఎంతో కీలకం. పలు సందర్భాల్లో వైద్యులు సైతం కరోనా సోకిన వారికి డి విటమిన్ ఎంతో కీలక అని ప్రకటించారు. అందుకే చాలా మంది డి విటమిన్ ట్యాబ్లెట్స్‌ను అధికంగా తీసుకుంటున్నారు. అయితే, డి విటమిన్ అధికంగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే డి విటమిన్‌ను తీసుకోవడం నిలిపివేయాలని సూచిస్తున్నారు.

వాస్తవానికి శరీరంలో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి ఉదయం సమయంలో ఎండలో ఉండటం ఉత్తమం. ఇది సహజమైన మార్గం. ఇది కాకుండా.. అధిక పోషకాహారాలు తినడం, సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా శరీరంలో విటమిన్ డి అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు.

విటమిన్ డి లోపం సంకేతాలు.. విటమిన్ డి మన శరీరానికి విస్తృత ప్రయోజనాలను అందిస్తుంది. అదే విటమిన్ డి లోపంతో బాధపడుతుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలసట, బలహీనత, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, విపరీతమైన మానసిక కల్లోలం ఏర్పడుతుంది.

విటమిన్ డి సప్లిమెంట్లు ఎప్పుడు అవసరం? విటమిన్ డి ఇతర విటమిన్లకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక రకమైన హార్మోన్ అని చెబుతారు వైద్యులు. సూర్యరశ్మికి మన శరీరాన్ని తాకినప్పుడు చర్మం నుంచి విడుదలయ్యే స్టెరాయిడ్ హార్మోన్. అయితే, చాలా తక్కువ ఆహారాలు మాత్రమే ఈ ‘విటమిన్‌ డి’ ని అందిస్తాయి. కానీ, తగినంత సూర్యరశ్మి లేనప్పుడు, శీతాకాలపు వాతావరణంలో శరీరానికి తగినంత విటమిన్ డిని పొందడం కష్టమవుతుంది. ఇది విటమిన్ డి లోపానికి దారితీస్తుంది.

విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్.. విటమిన్ డి టాక్సిసిటీ, హైపర్విటమినోసిస్ డి అనే అరుదైన పరిస్థితి ఎదరవుతుంది. ఇది శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరిగితే వస్తుంది. సాధారణంగా విటమిన్ డి సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. అయితే, సూర్యరశ్మి వల్ల, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎప్పుడూ రాదు. కేవలం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్లే వస్తుంది.

హైపర్‌కాల్సెమియా.. శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండటం ఈ లక్షణం కనిపిస్తుంది. అంటే రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి హానీ చేస్తుంది. సాధారణంగా, శరీరంలో కాల్షియం స్థాయి 8.5 నుంచి 10.8 mg/dL మధ్య ఉంటుంది. ఇది సాధారణ స్థాయిని మించిపోయినప్పుడు వికారం, వాంతులు, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన, జీర్ణశయ సమస్యలు వస్తాయి.

కీళ్ల నొప్పులు.. శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతంది. కాల్షియం, హార్మోన్లు కలిసి ఎముకలకు పోషకాన్ని అందకుండా అవుతుంది. ఇది కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. ఎముక పగుళ్లు, గాయాలు పెరిగే అవకాశం ఉంది.

కిడ్నీ సమస్యలు.. విటమిన్ డి టాక్సిసిటీ వల్ల వచ్చే హైపర్‌కాల్సెమియా కూడా కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీని ఫలితంగా అసాధారణ రీతిలో మూత్రవిసర్జన జరుగుతుంది, ఈ పరిస్థితిని పాలీయూరియా అంటారు.

ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డి విటమిన్‌ను తీసుకోవడం నిలిపివేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also read:

Health Tips: టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా.. చాలా డేంజర్ అంటోన్న ఆయుర్వేద నిపుణులు.. అవేంటంటే?

Tom Latham And Daryl Mitchell: మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లాథమ్, మిచెల్.. ఎన్ని పరుగులు చేశారంటే..

Kurnool District: విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu