Kurnool District: విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం నెలకొంది. పాపం పసివాడు..మూడు నెలల ముద్దులొలికే చిన్నోడు..ప్రమాదవశాత్తూ బైక్‌ వెనుక చక్రంలో ఇరుక్కొని ప్రాణాలు విడిచాడు.

Kurnool District:  విషాదం.. బైక్‌పై వెళ్తుండగా, తల్లి చేతుల్లో నుంచి జారిపడ్డ 3 నెలల పసివాడు.. చక్రంలో ఇరుక్కుని
Representative image
Follow us

|

Updated on: Jan 23, 2022 | 1:02 PM

Tragedy: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డిలో విషాదం నెలకొంది. పాపం పసివాడు..మూడు నెలల ముద్దులొలికే చిన్నోడు..ప్రమాదవశాత్తూ బైక్‌ వెనుక చక్రంలో ఇరుక్కొని మృతి చెందాడు. బాలుడికి ట్రీట్‌మెంట్‌ కోసం బైక్‌పై హాస్పిటల్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. బాలుడికి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో.. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు..చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రమాదవశాత్తూ పసికందు తల్లి చేతుల్లో నుంచి జారిపోయాడు. కింద పడిన బాలుడు బైక్ వెనుక చక్రంలో ఇరుక్కున్నాడు.  అప్పటివరకూ అంతా బాగానే ఉంది. బిడ్డతో కలిసి తల్లిదండ్రులు బైక్‌పై ఇంటికి దగ్గరకు వచ్చేశారు. మరికొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకునేవారు..అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. ఒక్కసారిగా తల్లి ఒడి నుంచి జారి పడి బైక్‌ వీల్‌లో ఇరుక్కుపోయాడు పసివాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు..బిడ్డను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పసివాడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే ఏకంగా పసివాడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read:  పైనుంచి చూస్తే అల్లం లోడే… లోపల చెక్ చేసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి