Health Tips: టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా.. చాలా డేంజర్ అంటోన్న ఆయుర్వేద నిపుణులు.. అవేంటంటే?

Health Tips: టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా.. చాలా డేంజర్ అంటోన్న ఆయుర్వేద నిపుణులు.. అవేంటంటే?
Tea With Namkeen

నమ్కీన్, బిస్కెట్లు, రస్క్ మొదలైనవాటిని టీతో చాలా ప్రేమగా తింటుంటాం. ఇంటికి వచ్చిన అతిథులకూ ఇలానే అందిస్తుంటాం. అయితే ఇలా టీతో పాటు వీటిని తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలుసా?

Venkata Chari

|

Jan 23, 2022 | 1:13 PM

Don’t Eat Salty Foods With Tea: నమ్కీన్, బిస్కెట్లు, రస్క్ మొదలైనవాటిని టీతో చాలా ప్రేమగా తింటుంటాం. ఇంటికి వచ్చిన అతిథులకూ ఇలానే అందిస్తుంటాం. అయితే ఇలా టీతో పాటు వీటిని తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తెలుసా? కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల అవి మన శరీరానికి చాలా హానీ చేస్తాయి. కాబట్టి కొన్ని ఆహారాలను ఎప్పుడూ కలపొద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

యాంటీ డైట్ అంటే ఏమిటి? ఆహారాల కాంబినేషన్‌లో కొన్నింటిని కలపకూడదు. ఇలా తప్పుగా వాటిని తీసుకోవడాన్ని యాంటీ-డైట్ అని పిలుస్తుంటారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. వీటిని సింగిల్‌గా తీసుకుంటేనే మంచి ఫలితాలు అందుతాయి. అలా కాకుండా వాటిని వేరే పదార్ధాలతో తినడం వల్ల వాటి పోషక విలువలు తగ్గి ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. పాలలో ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఆయుర్వేదంలో దీనిని విరుద్ధ ఆహారంగా పరిగణిస్తారు. అలాగే పాలతో చేసిన టీతో నమ్కీన్, బిస్కెట్లు, రస్క్ వంటి వాటిని తింటే, అది యాంటీ డైట్‌గా మారుతుంది. ఈ ఆహార కలయిక శరీరానికి హాని చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉప్పును కలుపుతారు. బిస్కెట్లు, రస్క్‌లు వంటి వాటిలో ఉప్పు కూడా ఉంటుంది. వీటిని టీతో తీసుకోవడం వల్ల శరీరానికి హానికరంగా మారుతుంది.

ఎక్కువ కాలం ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో ఇవి విషంలా తయారవుతాయి. ఇది శరీరానికి తక్షణమే హాని కలిగించకపోయినా.. చాలాకాలం తరువాత అవి శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపిస్తాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఇవి తీవ్రంగా మారి ప్రమాదకరంగా మారతాయి. వీటివల్ల ఉదర వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్ కాంబినేషన్స్ తీసుకోవద్దు.. సిట్రస్ ఐస్ క్రీం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది నారింజ, జామ, తమలపాకు రుచిని కలిగి ఉంటుంది. జామ, మిరప ఐస్ క్రీం కూడా అందుబాటులో ఉంది. అయితే పుల్లని పదార్థాలు, మిరపకాయలను పాలతో తినకూడదు. ఆయుర్వేదంలో, పాలతో నిమ్మకాయ లేదా పుల్లనివి తీసుకోవడం నిషిద్ధంగా పరిగణిస్తారు.

మిల్క్ షేక్, పాలతో పండ్లు తినకూడదు.. పాస్తాను పిల్లలకు తినిపించడానికి ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. అందులో ఉప్పు, ఎర్ర మిరియాలు రెండింటినీ పాలలో కలుపుతారు. ఇది పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వైట్ సాస్ పాస్తాకు బదులుగా, పిల్లలకు రెడ్ సాస్ పాస్తా ఇవ్వవచ్చు.

చేపలను వండేప్పుడు పాల ఉత్పత్తులు వాడొద్దు. తేనెను ఎప్పుడూ వేడిగా తినకూడదు. బరువు తగ్గడానికి, ప్రజలు వేడి నీటిలో తేనె కలిపి తాగుతుంటారు. దానికి నిమ్మరసం కలుపుతారు. ఇది శరీరానికి హాని చేస్తుంది. ఈ ఆహార కలయికలు భవిష్యత్తులో పెద్ద వ్యాధులను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. నెయ్యి, తేనె ఎప్పుడూ కలపకూడదు. టీతో పాటు ఉప్పు, డ్రై ఫ్రూట్స్ తినవద్దు. అధికంగా తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. వేడి, చల్లని పదార్థాలను కలిపి తినకూడదు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

Also Read: Coriander Water Benefits: ఆరోగ్యానికి అమృతం.. ధనియాల నీటితో ఆ సమస్యలన్నీ మటుమాయం..

Health Tips: పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా..? అయితే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి.. బరువు అస్సలు పెరగరు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu