AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bommidayalu Pulusu: సండే స్పెషల్.. గోదావరి జిల్లా స్టైల్ లో అమ్మమ్మ చేతి వంట బొమ్మిడాయిల పులుసు తయారీ..

Bommidayalu Pulusu: నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్.. పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ , చేపలు ఇలా ఎన్నో రకాల సి ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో చేపలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా గోదావరి జిల్లా..

Bommidayalu Pulusu: సండే స్పెషల్.. గోదావరి జిల్లా స్టైల్ లో అమ్మమ్మ చేతి వంట బొమ్మిడాయిల పులుసు తయారీ..
Bommidayalu Pulusu
Surya Kala
|

Updated on: Jan 23, 2022 | 12:57 PM

Share

Bommidayalu Pulusu: నాన్ వెజ్ ప్రియుల్లో సీఫుడ్ లవర్స్ డిఫరెంట్.. పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ , చేపలు ఇలా ఎన్నో రకాల సి ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో చేపలది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు చేపలకు విడదీయడానికి బంధం ఉంది. పండుగప్ప, కొర్రమీను, బొమ్మిడాయి, పులస ఇలా అనేక రకాల చేపలు ఉన్నాయి. చేపకు తగినట్లుగా రుచికరమైన కూరను తయారు చేయడం గోదావరి జిల్లా వాసుల స్పెషాలిటీ.. ఈరోజు అమ్మకాలం స్టైల్ లో బొమ్మిడాయిల పులుసు తయారీ గురించి తెలుసుకుందాం..

కావలిసిన పదార్ధాలు:

బొమ్మిడాయిలు -1/2 కేజీ ఉల్లిపాయలు (పెద్ద సైజ్) పచ్చి మిర్చి 4 కారం – ౩ టేబుల్ స్పూన్లు పసుపు – అర తీ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా చింత పండు గుజ్జు లవంగాలు 5 యాలకులు 2 దాల్చిన చెక్క చిన్న ముక్క వేల్లుల్లి రెబ్బలు 5 కరివేపాకు కొత్తిమీర నూనె

తయారీ విధానం: ముందుగా బొమ్మిడాయిలు ను శుభ్రంగా చేసుకోవాలి. గిన్నెలో కళ్ళు ఉప్పు వేసుకుని చేపలు వేసుకుని జిగురు పోయేవరకూ కడుక్కోవాలి. ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సిలో వేసుకుని లవంగాలు ,యాలకులు , దాల్చిన చెక్క చిన్న ముక్క , వేల్లుల్లి రెబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దళసరి గిన్నె పెట్టుకొని.. ఆరు స్పూన్ల నూనె వేసుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని వేయించిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ వేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని వేయించుకోవాలి. అనంతరం ఉల్లిపాయ మిశ్రమంలో కారం వేసుకుని కొంచెం సేపు వేయించుకుని ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బొమ్మిడాయిల చెపలను వేసుకుని కొన్ని సెకన్లు వేయించి.. తర్వాత చింతపండు గుజ్జు లో నీరు పోసుకుని దానిని పులుసు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా మరించిన తర్వాత ఉప్పు, పులుపు చూసుకోవాలి. దగ్గరకు మరిగించితే గోదావరి స్టైల్ లో అమ్మమ్మ కాలం నాటి రుచికరమైన బొమ్మిడాయిలు పులుసు రెడీ..

ఆరోగ్య ప్రయోజనాలు: చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు,

Also Read:   కరోనా నుంచి కోలుకున్నారా.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అవి ఏమిటంటే..