- Telugu News Photo Gallery Health Tips: If you like to eating sweet things then Try these 5 snacks, your weight will not gain
Health Tips: పదే పదే స్వీట్ తినాలనిపిస్తుందా..? అయితే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి.. బరువు అస్సలు పెరగరు
Health Care: స్వీట్లు తినాలనే కొరిక చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు పదేపదే స్వాట్లు తిని పలు అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీని కారణంగా వారి బరువు పెరుగుతుంది. ఇలాంటి వారు చక్కెరకు దూరంగా ఉండాలనుకున్నా.. సాధ్యం కాదు. అలాంటి వారు బరువు పెరగకుండా అదుపులో ఉంచే స్వీట్లు, స్నాక్స్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ స్నాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 23, 2022 | 12:27 PM

బాదంపప్పు - తేనె: తేనె ప్రత్యేకత ఏమిటంటే దీనిని తీసుకోవడం వల్ల తీపి కోరికలు తీరుతాయి.. కానీ బరువు పెరగదు. అందులో నానబెట్టిన బాదంపప్పులను వేసుకొని తింటే.. ఆరోగ్యవంతంగా ఉండవచ్చు.

డ్రైఫ్రూట్స్: డ్రైఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. ఇవి బరువును అదుపులో ఉంచడంతోపాటు తినడానికి కూడా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మీకు కావాలంటే, మీరు ఎండిన ఆపిల్ చిప్స్ కూడా తినవచ్చు.

డార్క్ చాక్లెట్: బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల షుగర్ కోరిక తీరడంతోపాటు బరువు పెరిగే సమస్య కూడా ఉండదు

పీనట్ బటర్: పీనట్ బటర్ - బాదం మిక్స్ చేసి తినవచ్చు. దీనిలో వెన్నను సరైన మొత్తంలో కలిపితే.. చక్కెర కోరికను కూడా చాలా వరకు తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.

వెజిటెబుల్ చిప్స్: మీకు కావాలంటే.. మీరు వెజ్ చిప్స్‌ని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కూరగాయలను కట్ చేసి, వాటిని పాన్ పై ఉంచి వేడి చేయాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత వాటిని తినాలి. అయితే.. వాటని బేకింగ్ చేయడం ద్వారా అవి క్రంచీ ఫుడ్‌గా కరకరలాడుతాయి.




