AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Soup: చలికాలంలో వేడి వేడి క్యారెట్‌ సూప్.. ఆరోగ్యంతో పాటు అదిరే రుచి..

Carrot Soup: క్యారెట్‌లో పోషకాలు అధికం. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కాకుండా క్యారెట్‌లో నాలుగు రకాల ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో

Carrot Soup: చలికాలంలో వేడి వేడి క్యారెట్‌ సూప్.. ఆరోగ్యంతో పాటు అదిరే రుచి..
Carrot Soup
uppula Raju
|

Updated on: Jan 24, 2022 | 7:14 AM

Share

Carrot Soup: క్యారెట్‌లో పోషకాలు అధికం. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కాకుండా క్యారెట్‌లో నాలుగు రకాల ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఇది పొటాషియం విటమిన్ సిని అందించడమే కాకుండా, ప్రొవిటమిన్ ఎ కూడా పుష్కలంగా అందిస్తుంది. క్యారెట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఇతర ప్రయోజనాలతో పాటు కంటి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతే కాదు ఇందులో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది.

శీతాకాలంలో ఎక్కువగా లభించే కూరగాయ అయిన క్యారెట్‌తో మీరు చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన సూప్ తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేయడం చాలా సులభం. ఈ క్యారెట్ సూప్ రుచిగా ఉండటమే కాకుండా లోపలి నుంచి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అదే సమయంలో మీకు దగ్గు లేదా జలుబు సమస్య ఉంటే తక్షణ ఉపశమనం కోసం క్యారెట్ సూప్‌ను ప్రయత్నించవచ్చు. మీరు దీన్ని ఇంట్లో ఎలా తయారు చేయలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

1. తరిగిన 4 నుంచి 5 క్యారెట్లు

2. తాజాగా గ్రౌండ్ నల్ల మిరియాలు

3. 3 నుంచి 4 వెల్లుల్లి, లవంగాలు

4. కొంచెం అల్లం

5. జీలకర్ర ఒక చెంచా

6. మొక్కజొన్న పిండి

7. తరిగిన పచ్చి ఉల్లిపాయ

8. చాట్ మసాలా

9. కొన్ని ఉల్లిపాయ ముక్కలు

10. రుచికి సరిపడ ఉప్పు

ఎలా తయారుచేయాలి..?

1. ఒక గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి వేయాలి.

2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

3. ఇప్పుడు అందులో క్యారెట్ వేసి ఉడికించాలి.

4. ఇప్పుడు క్యారెట్‌ను శుభ్రమైన పాత్రలో తీసి చల్లార్చాలి.

5. కొంత సమయం తరువాత ఉడికిన క్యారెట్‌లను మిక్సీలో వేయాలి.

6. ఇప్పుడు ఒక గిన్నెలో క్యారెట్ పేస్ట్ ఉంచాలి. మీ అవసరానికి అనుగుణంగా నీరు కలపాలి.

7. ఈ సమయంలో ఉప్పు, మిరియాలు, చాట్ మసాలా కలపాలి.

8. కొద్దిసేపు తక్కువ మంట మీద మరిగించాలి.

9. అంతే మీ సూప్ రెడీ అయిపోయింది.

Deepak Chahar: కంటతడి పెట్టిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని గెలిపించలేకపోయానే.. విరోచిత పోరాటం వృథా..

IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?