AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepak Chahar: కంటతడి పెట్టిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని గెలిపించలేకపోయానే.. విరోచిత పోరాటం వృథా..

Deepak Chahar: టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన నిరాశగా ముగిసింది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా వన్డే సిరీస్ ను కూడా ఘోరంగా కోల్పోయింది.

Deepak Chahar: కంటతడి పెట్టిన దీపక్ చాహర్.. మ్యాచ్‌ని గెలిపించలేకపోయానే.. విరోచిత పోరాటం వృథా..
Deepak Chahar
uppula Raju
|

Updated on: Jan 24, 2022 | 7:01 AM

Share

Deepak Chahar: టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పర్యటన నిరాశగా ముగిసింది. టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా వన్డే సిరీస్ ను కూడా ఘోరంగా కోల్పోయింది. పార్ల్‌లో ఆడిన రెండు వన్డేల్లో ఓడిపోయిన భారత జట్టు కేప్‌టౌన్ వన్డేను కూడా గెలవలేకపోయింది. సౌతాఫ్రికా సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కేప్ టౌన్ వన్డేలో ఓ దశలో టీమ్ ఇండియా గెలుపొందినట్లే కనిపించినా ఆ తర్వాత సౌతాఫ్రికా అతిథులకు విజయాన్ని అందకుండా చేసింది. భారత్ ఓటమి తర్వాత ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

అతడి కళ్లు కన్నీళ్లతో తడిసిపోయాయి. దీనికి కారణం దీపక్ చాహర్ ఫాస్ట్‌గా హాఫ్ సెంచరీ కొట్టి టీమ్ ఇండియా విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికీ కీలక సందర్భంలో ఔట్ కావడంతో టీమ్ ఇండియా మ్యాచ్‌లో ఓడిపోయింది. భారత్ 7వ వికెట్ 42.1 ఓవర్లలో పడిపోయింది. ఆ సమయంలో జస్ప్రీత్ బుమ్రా దీపక్ చాహర్‌కు మద్దతుగా నిలిచాడు . బుమ్రా రాగానే దీపక్ చాహర్ ఓపెన్‌గా గేమ్‌ని ప్రదర్శించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టి దక్షిణాఫ్రికా జట్టుపై ఎదురుదాడి చేశాడు. ఒక దశలో భారత జట్టు 223 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ, బుమ్రాతో కలిసి 8వ వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో దీపక్ చాహర్ మ్యాచ్ గమనాన్ని మార్చాడు.

48వ ఓవర్‌లో ఆట మలుపు తిరిగింది

దీపక్ చాహర్ తన అర్ధ సెంచరీని సాధించాడు. బుమ్రా కూడా అత్యుత్తమ మద్దతునిచ్చాడు అయితే 48వ ఓవర్‌లో లుంగి ఎంగిడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీపక్ చాహర్‌ని ఔట్‌ చేశాడు. అతను పెవిలియన్‌కు తిరిగి రావడానికి బదులుగా మైదానం వైపు ఉంచిన కుర్చీపై కూర్చున్నాడు. అయితే చాహర్ అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. 49వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వికెట్ కూడా పడిపోయింది. అప్పుడు చాహర్ తనను తాను తిట్టుకోవడం కనిపించింది. చివరి ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ వికెట్ పడిపోవడంతో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దీపక్ చాహర్ భావోద్వేగానికి గురయ్యాడు.

దీపక్ చాహర్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి

దీపక్ చాహర్ కేప్ టౌన్‌లో టీమిండియాను గెలిపించకపోవచ్చు కానీ ఈ ఆటగాడు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. చాహర్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా తన వంతు సహకారం అందించగలడని నిరూపించాడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. సౌతాఫ్రికా ఓటమి నుంచి టీమిండియా ఎలాంటి గుణపాఠం నేర్చుకుంటుందో వేచి చూడాలి.

IND vs SA: ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి.. 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం..

Viral Photos: అక్కడ మద్యం తాగి పట్టుబడితే ఏ శిక్ష వేస్తారో తెలిస్తే షాక్..?

Vastu Tips: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. వెంటనే వాస్తు నియమాలలో మార్పులు చేయండి..