AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామిక ఫేస్ కనిపించిందోచ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. కోహ్లీ సెలబ్రేషన్స్‌లో భాగమైన కుమార్తె..!

Vamika-Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లి రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ, రెండుసార్లు సెంచరీలుగా మార్చలేకపోయాడు. అయితే, కేప్ టౌన్ అర్ధ సెంచరీ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.

Watch Video: వామిక ఫేస్ కనిపించిందోచ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. కోహ్లీ సెలబ్రేషన్స్‌లో భాగమైన కుమార్తె..!
Virat Kohli Vamika
Venkata Chari
|

Updated on: Jan 24, 2022 | 1:51 PM

Share

IND vs SA: టీమిండియా దక్షిణాఫ్రికా (India Vs South Africa 2021)పర్యటన నిరాశనే మిగిల్చింది. టెస్టు సిరీస్‌లో ఆధిక్యాన్ని కోల్పోయి, ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన భారత జట్టు.. 6 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలవగలిగింది. ఈ పర్యటనలో చివరి మ్యాచ్ జనవరి 23 ఆదివారం కేప్ టౌన్‌లో జరగగా, మరోసారి భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి చివరి వన్డే సంతోషకరమైన క్షణాన్ని తెచ్చిపెట్టింది. విరాట్ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ కుమార్తె వామిక(Vamika) కూడా ఈ సెలబ్రేషన్స్‌ను స్టాండ్స్‌ను చూసింది. కోహ్లి(Virat Kohli) ఈ అర్ధ సెంచరీని తన కూతురికి అంకితమివ్వడం భారత అభిమానులను కూడా సంతోషపరిచింది.

చాలా కాలం తర్వాత తొలిసారి కెప్టెన్సీ లేకుండా భారత జట్టులో బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడుతున్న కోహ్లి.. ఈ వన్డే సిరీస్‌లో తన సాధారణ దూకుడు శైలిలో కనిపించలేదు. పార్ల్‌లో ఆడిన మొదటి వన్డేలో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. కానీ అప్పుడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. తదుపరి వన్డేలో ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇక మూడో వన్డేలో మరో కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, ఈసారి మాత్రం సంబరాలను ఆపుకోలేకపోయాడు.

కూతురితో హాఫ్ సెంచరీ వేడుక.. కోహ్లి 63 బంతుల్లో 64వ వన్డే అర్ధ సెంచరీని సాధించాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ, కుమార్తె వామిక కూడా స్టాండ్స్‌లో ఈ అర్థ సెంచరీకి సాక్షులుగా నిలిచారు. కోహ్లి అనుష్క, కుమార్తె వైపు చూసి కరచాలనం చేస్తూ, బ్యాట్ చూపించి, ఆపై కుమార్తెను ఒడిలో ఊపుతున్న శైలిలో అర్ధ సెంచరీ వేడుక చేసుకున్నాడు.

కోహ్లి హాఫ్ సెంచరీ వేడుకలో అనుష్క కూడా పాల్గొని కూతురుతో పాటు చప్పట్లు కొట్టింది. ఈ సందర్భంగా కోహ్లీ కూతురు చిత్రాలు కూడా తెరపైకి వచ్చాయి. కోహ్లి కూతురు పుట్టిన తర్వాత అభిమానులు వామిక చిత్రాన్ని చూడటం ఇదే తొలిసారి.

సెంచరీ కోసం నిరీక్షణ పెరిగింది.. అయితే మరోసారి కోహ్లీ 71వ సెంచరీని చూడాలని అభిమానుల నిరీక్షణకు తెరపడలేదు. భారత మాజీ కెప్టెన్ కోహ్లి చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడని, రెండేళ్లకు పైగా నిరీక్షణకు తెరపడుతుందని అనిపించినా అది కుదరలేదు. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో కోహ్లీ 65 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ 51, 0, 65 పరుగులు చేశాడు. ఈ విధంగా 116 పరుగులతో శిఖర్ ధావన్ (169 పరుగులు) తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

Also Read: Team India: ‘ఫిట్’ మ్యాన్‌‌గా ఉంటేనే సారథిగా రాణిస్తాడు.. కోహ్లీ, రోహిత్‌లపై మాజీ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు..!

India vs South Africa: టీమిండియా ఘోర పరాజయానికి 5 కారణాలు.. రాహుల్ కెప్టెన్సీపై నీలినీడలు..!