IND vs SA: పీడకలలా మారిన సౌతాఫ్రికా టూర్.. బ్యాటింగ్‌‌తోపాటు కెప్టెన్సీలోనూ విఫలమైన ‘ఫ్యూచర్ టెస్ట్’ సారథి..!

KL Rahul: గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లలేదు. ఈ కారణంగా వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

IND vs SA: పీడకలలా మారిన సౌతాఫ్రికా టూర్.. బ్యాటింగ్‌‌తోపాటు కెప్టెన్సీలోనూ విఫలమైన 'ఫ్యూచర్ టెస్ట్' సారథి..!
Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Jan 24, 2022 | 9:11 AM

India Vs South Africa 2021: విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) ల తర్వాత ప్రస్తుతం భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లను లెక్కిస్తే, అందులో కేఎల్ రాహుల్(KL Rahul) నంబర్ వన్ స్థానంలో ఉంటాడు. రాహుల్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని పలుమార్లు నిరూపించుకున్నాడు. ఒకప్పుడు పేలవ ఫాంతో టీమిండియా నుంచి తప్పుకుని, ఘనంగా పునరాగమనం చేశాడు. ప్రస్తుతం భారత్‌ తరపున మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. కానీ, దక్షిణాఫ్రికా పర్యటన రాహుల్‌కు అంతగా కలిసిరాలేదు. ఈ పర్యటనలో ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ గాయం తర్వాత, రాహుల్ భారత వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. టెస్టు సిరీస్ ఓటమి తర్వాత రాహుల్ కెప్టెన్సీలో భారత్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంటుందని భావించినా అది కుదరలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్ సిరీస్ కోల్పోయింది.

కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ విఫలం.. ఈ సిరీస్‌లో రాహుల్ కెప్టెన్సీకి ప్రమాదం ఏర్పడింది. వన్డే, టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నప్పుడు రాహుల్‌కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్ గా మారి విఫలమయ్యాడు. అయితే కెప్టెన్‌గా రాహుల్ సమర్థంగా రాణించలేకపోయాడు. అతని నిర్ణయాలు కూడా మ్యచ్‌ను ప్రభావితం చేయలేకపోయాయి. అతని కెప్టెన్సీలో సరైన వ్యూహం కూడా మిస్సయింది. రాహుల్ తన ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రదర్శనను కూడా పొందలేకపోయాడు. ఫలితంగా భారత్ అత్యుత్తమ బౌలింగ్ కూడా ఘెరంగా విఫలమైంది.

ఈ సిరీస్ నుంచి రాహుల్ టెస్టు కెప్టెన్సీ కూడా ప్రమాదంలో పడింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత అతను రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌లతో రేసులోనిలిచాడు. అయితే వన్డే సిరీస్‌లో విఫలమవడం వల్ల టెస్ట్ కెప్టెన్ అయ్యే అవకాశాలను దాదాపుగా పోగొట్టుకున్నాడు.

ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తున్నాడు.. కెప్టెన్సీ ఒత్తిడి వ్యక్తిగత ప్రదర్శనను ప్రభావితం చేస్తుందని పలుమార్లు నిరూపణమైంది. ఇది రాహుల్‌కి కూడా వర్తిస్తోంది. రాహుల్ ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. పార్ల్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. రెండో మ్యాచ్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసినా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. రాహుల్ బ్యాటింగ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలి. కానీ, అతని స్పెషాలిటీ ఈ మ్యాచులో కనిపిపించలేదు. రెండో మ్యాచ్‌లో 55 పరుగులు చేసేందుకు రాహుల్ 79 బంతులు ఆడాడు. అతను పూర్తిగా ఒత్తిడిలో కనిపించాడు. మూడో మ్యాచ్‌లో రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఆదివారం జరిగిన చివరి వన్డేలో రాహుల్ బ్యాట్ నుంచి 10 బంతుల్లో తొమ్మిది పరుగులు మాత్రమే వచ్చాయి.

ఖచ్చితంగా ఈ పర్యటన రాహుల్‌ను చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అయితే ఈ పర్యటనను కేఎల్ వీలైనంత త్వరగా మర్చిపోవాలనుకుంటున్నాడు.

Also Read: Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ.. జాతీయ గీతాలాపన చేస్తుంటే చూయింగ్ గమ్.. ఫైరవుతున్న నెటిజన్లు..

Watch Video: వామికా ఫేస్ కనిపించిందోచ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్.. కోహ్లీ సెలబ్రేషన్స్‌లో భాగమైన కుమార్తె..!