ICC Women World Cup: ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్‌.. భారత వన్డే కెప్టెన్ సమాధానం ఏంటంటే?

Mithali Raj: భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ 23 ఏళ్లుగా టీమ్ ఇండియాలో భాగమైంది. ఆమెకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్. ఈ టోర్నీలో సత్తా చాటాలని కోరుకుంటోంది.

ICC Women World Cup: ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్‌.. భారత వన్డే కెప్టెన్ సమాధానం ఏంటంటే?
Mithali Raj
Follow us

|

Updated on: Jan 24, 2022 | 9:32 AM

INDW vs NZW: మిథాలీ రాజ్ (Mithali Raj) సారథ్యంలో న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ 2022(ICC Women World Cup)లో భారత మహిళా క్రికెట్ జట్టు పాల్గొననుంది. 23 ఏళ్లుగా టీమ్ ఇండియాలో భాగమైన వెటరన్ ప్లేయర్ మిథాలీ రాజ్‌కి ఈ ప్రపంచకప్ చివరిది కానుంది. మిథాలీ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత మిథాలీ రిటైర్మెంట్ తీసుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

న్యూజిలాండ్‌తో సిరీస్‌.. ప్రపంచకప్‌కు ముందు ఆ జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ వెళ్లే ముందు మిథాలీ రాజ్ మీడియా సమావేశంలో పాల్గొని తన భవిష్యత్తు గురించి కూడా మాట్లాడింది. మిథాలీ రాజ్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా, ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు.

దృష్టంతా ప్రపంచకప్‌పైనే.. ఇది తన చివరి ప్రపంచకప్ అని మిథాలీ రాజ్ అంగీకరించింది. కానీ, రిటైర్మెంట్ ప్లాన్ గురించి మాత్రం వెల్లడించలేదు.’అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం నా దృష్టి వచ్చే రెండు నెలలపైనే ఉంది. నేను నా శక్తినంతా ప్రపంచకప్‌లో చూపించాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి’ అని పేర్కొంది.

అగ్రశ్రేణి ఆటగాళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్‌లే కీలకం.. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మహిళలు ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు మూడు మ్యాచ్‌లలో రెండుసార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్‌లో జట్టు అదే నిలకడను కలిగి ఉండాలని కోరుకుంటుందని, దీని కోసం ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడవలసి ఉంటుందని మిథాలీ పేర్కొంది. ‘2017 ప్రపంచకప్‌లో కొందరు టాప్‌ఆర్డర్‌ ఆటగాళ్లు సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతుండగా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు తనకు మద్దతుగా నిలవడంతో జట్టు వరుసగా 250 నుంచి 270 పరుగులు చేసింది. ఈసారి కూడా అలాంటిదే చేసేందుకు ప్రయత్నిస్తా’ అంటూ మిథాలీ వివరించింది.

‘గత నాలుగేళ్లలో దేశవాళీ క్రికెట్‌ స్థాయి చాలా మెరుగుపడింది. చాలా మంది ఆటగాళ్లు సెంచరీలు చేయడం చూశాను. చాలా మంది అమ్మాయిలకు విదేశాల్లో లీగ్‌లు ఆడే అవకాశం వచ్చింది. చాలా మంది ఆటగాళ్లు ఈ విషయాల నుంచి చాలా అనుభవాన్ని పొందారు. మాకు ఇప్పుడు ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉన్నారు’ అంటూ మిథాలీ పేర్కొంది.

Also Read: IND vs SA: పీడకలలా మారిన సౌతాఫ్రికా టూర్.. బ్యాటింగ్‌‌తోపాటు కెప్టెన్సీలోనూ విఫలమైన ‘ఫ్యూచర్ టెస్ట్’ సారథి..!

Virat Kohli: వివాదంలో విరాట్ కోహ్లీ.. జాతీయ గీతాలాపన చేస్తుంటే చూయింగ్ గమ్.. ఫైరవుతున్న నెటిజన్లు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ