AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోల్‌కతాతో కటీఫ్.. భావోద్వేగానికి గురైన టీమిండియా యంగ్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో

Shubman Gill: శుభ్‌మాన్ గిల్ 2018 నుంచి ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. అయితే ఈసారి ఫ్రాంచైజీ అతనిని రిటైన్ చేయకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

Watch Video: కోల్‌కతాతో కటీఫ్.. భావోద్వేగానికి గురైన టీమిండియా యంగ్ ప్లేయర్.. వైరలవుతోన్న వీడియో
Shubman Gill
Venkata Chari
|

Updated on: Jan 24, 2022 | 9:58 AM

Share

IPL 2022 Mega Auction: భారత యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ ఈసారి ఐపీఎల్ -2022లో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ తరపున ఆడబోతున్నాడు. ఇంతకుముందు, గిల్ 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో భాగస్వామ్యమయ్యాడు. చాలా విజయవంతమయ్యాడు. అయితే ఈసారి రెండుసార్లు విజేత గిల్‌ను మాత్రం నిలబెట్టుకోలేదు. అహ్మదాబాద్ టీంతో చేరాడు. దీంతో గిల్, కోల్‌కతా మధ్య నాలుగేళ్ల అనుబంధం దూరమైంది. సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేయాలని కోల్‌కతా నిర్ణయించింది. ప్రస్తుతం కొత్త జట్టు జెర్సీని ధరించేందుకు సిద్ధమైన గిల్ తన పాత జట్టుపై భావోద్వేగానికి గురయ్యాడు.

గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో అతను KKRతో తన ప్రయాణాన్ని పంచుకున్నాడు. ఈ వీడియోలో, అతను ఫ్రాంచైజీతో గడిపిన చాలా క్షణాలను కవర్ చేశాడు. గిల్ ఈ వీడియోలో మొదటి సీజన్ నుంచి చివరి సీజన్ వరకు అందులో పంచుకున్నాడు. గిల్ ఈ వీడియోతో పాటు చిన్న క్యాప్షన్ కూడా అందించాడు. గిల్ ఈ వీడియోతో “కోల్‌కతాతో ఓ కలలాంటి ప్రయాణం” అని వీడియో వదిలాడు.

కేకేఆర్‌తో ప్రయాణం.. పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గిల్ కూడా ఉన్నాడు. ఈ ప్రపంచకప్ తర్వాత, గిల్‌ను రూ. 1.8 కోట్లకు కేకేఆర్ చేర్చుకుంది. ఈ ఏడాది అతని బేస్ ధర రూ. 20 లక్షలు. గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడి 1417 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 123గా ఉంది. 2019లో, అతను లీగ్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. గిల్ భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 558 పరుగులు చేశాడు. మూడు వన్డేలు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్‌లో 49 పరుగులు మాత్రమే వచ్చాయి.

ఈ ఆటగాళ్లతో జతకట్టేందుకు సిద్ధం.. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ తన ముగ్గురు రిటైన్డ్ ఆటగాళ్లను ప్రకటించింది. ఇందులో ముంబై ఇండియన్స్‌లో ముఖ్యమైన సభ్యుడు హార్దిక్ పాండ్యా పేరును ఈ కొత్త ఫ్రాంచైజీ చేర్చింది. పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇది కాకుండా, ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా అహ్మదాబాద్ చేర్చుకుంది. మూడో ఆటగాడిగా గిల్ పేరును ప్రకటించింది. ఆశిష్ నెహ్రా, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ గ్యారీ కిస్టెర్న్‌లను జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేర్చుకుంది.

Also Read: ICC Women World Cup: ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్‌.. భారత వన్డే కెప్టెన్ సమాధానం ఏంటంటే?

IND vs SA: పీడకలలా మారిన సౌతాఫ్రికా టూర్.. బ్యాటింగ్‌‌తోపాటు కెప్టెన్సీలోనూ విఫలమైన ‘ఫ్యూచర్ టెస్ట్’ సారథి..!