AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forbes: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌ వాసి.. రూ.250తో ప్రారంభమై కోట్లకు పడగెత్తిన వ్యాపారి

నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి. పదివేల పెన్షన్‌. ఆ డబ్బుతోనే కుటుంబం గడవాలి. ఆ డబ్బుతోనే నెట్టుకుని వచ్చారు..

Forbes: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌ వాసి.. రూ.250తో ప్రారంభమై కోట్లకు పడగెత్తిన వ్యాపారి
Forbes
Ashok Bheemanapalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 08, 2023 | 9:43 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్న టౌన్‌కు చెందిన మురళీ దివి. నేడు ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోనే అత్యంత కోటీశ్వరుడిగా నిలిచారు. 53 వేల కోట్ల ఆస్తితో మురళీ దివి భారతీయులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒకరోజులో, ఒక ఏడాదిలో జరిగిన పరిణామం కాదిది. నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్. చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి. పదివేల పెన్షన్‌. ఆ డబ్బుతోనే కుటుంబం గడవాలి. ఆ డబ్బుతోనే నెట్టుకుని వచ్చారు.

డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో మురళి చేతిలో ఉన్న డబ్బు 500 వందల రూపాయిలు. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకి వెళ్ళగలిగారు‌. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు‌. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు. 1984 లో మురళి 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు‌. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ దివి రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995 లో మురళీ రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చి సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఆ తర్వాత ఏడేళ్ళకి అంటే.. 2002 లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నంలో స్థాపించారు.

ప్రపంచం ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల (8800 కోట్లు) వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది‌. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివి కీ చోటు కల్పించింది‌‌. ప్రస్తుతం మురళీ దివి 53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.