TSRTC: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌.. క్యాష్‌తో పనిలేకుండా డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?

సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెడుతూ క్యాష్‌తో పనిలేకుండా, ఈ మెషిన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ చెప్పారు.

TSRTC: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌..  క్యాష్‌తో పనిలేకుండా డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?
Tsrtc
Follow us
Basha Shek

|

Updated on: Oct 15, 2022 | 4:05 PM

సిటీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. వచ్చే నెల నుంచే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌ పే దితర డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. కాగా ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఐ-టిమ్స్‌ సహాయంతో డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెడుతూ క్యాష్‌తో పనిలేకుండా, ఈ మెషిన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ చెప్పారు.

కాగా ఇప్పటికే మియాపూర్‌-1, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, బీహెచ్‌ఈఎల్‌, కుషాయిగూడ డిపోల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా యూపీఐ చెల్లింపులు విజయవంతంగా అమలు చేశామని వెంకన్న తెలిపారు. అలాగే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల విధానం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరిన్ని సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సు పాసుల రెన్యూవల్‌ కోసం కౌంటర్ల ముందు గంటల తరబడి వేచి చూసే పని లేకుండా.. సిటీ బస్సుల్లోనే బస్సు ఈ అవకాశం కల్పించనున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..