Telangana: కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి.. ప్రజలకు డీహెచ్ సూచన

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లోనూ కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసులు అధికంగా నమోదవుతోంది. ఈ క్రమంలో...

Telangana: కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి.. ప్రజలకు డీహెచ్ సూచన
Dh Srinivas Rao
Follow us

|

Updated on: Jun 10, 2022 | 6:28 PM

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) లోనూ కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసులు అధికంగా నమోదవుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు(DH.Srinivasarao) సూచించారు. తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 36వేలకు పైగా యాక్టివ్‌ కేసుల సంఖ్య ఉండగా తెలంగాణలో 811 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆస్పత్రిలో చేరికలు, మరణాలు సున్నాగానే ఉన్నాయని డీహెచ్ వెల్లడించారు. గత మూడు రోజులుగా 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో కేసులు రావడం రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే చూస్తున్నామని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.

ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ దాదాపు వందశాతం పూర్తవడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నా అది ఫోర్త్ వేవ్ కు కారణం కాకపోవచ్చు. కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. మనతో పాటే ఉంది. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. పాండమిక్‌గా మొదలైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం ఎండమిక్‌ స్టేజిలో కొనసాగుతోంది. ఇంకో ఆర్నెళ్ల పాటు కేసుల పెరుగుదల ఉంటుంది. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం మరిచిపోవద్దు.

             – శ్రీనివాసరావు, తెలంగాణ డీహెచ్

ఇవి కూడా చదవండి

తెలంగాణలో కేసులు పెరుగుతున్నా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు డీహెచ్. ఇప్పుడు పెరుగుతున్న కేసుల్ని నాలుగో వేవ్ గా చూడలేమన్నారు. ఏదైనా కొత్త వేరియంట్ వస్తే తప్ప.. మరో వేవ్ ఉంటుందని చెప్పలేమని వెల్లడించారు. మనదేశంలో కొత్త వేరియంట్ పుట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు.

వచ్చేది వర్షాకాలం.. ఆ కాలంలో రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని డీహెచ్ తెలిపారు. వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులో ఉందన్న డీహెచ్.. దాదాపు 90శాతం మేర వారికి టీకా ఇచ్చామన్నారు. తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!