Telangana: బండి సంజయ్, రాహుల్ గాంధీ పై కేటీఆర్ ఫైర్.. ఎడ్లు, వడ్లు అంటే తెలియవని కౌంటర్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ కు వడ్లు, ఎడ్లు తెలియదని, ఆయనకు పబ్బులు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. బండి సంజయ్....

Telangana: బండి సంజయ్, రాహుల్ గాంధీ పై కేటీఆర్ ఫైర్.. ఎడ్లు, వడ్లు అంటే తెలియవని కౌంటర్
Telangana Minister KTR
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 10, 2022 | 3:15 PM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ కు వడ్లు, ఎడ్లు తెలియదని, ఆయనకు పబ్బులు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఓ విచిత్రమైన మనిషి అన్న కేటీఆర్(KTR).. ప్రధాని మోదీ ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలను తెలంగాణకు(Telangana) ఆహ్వానించి ఎంతగానో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో పర్యటించిన కేటీఆర్.. స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని కేటీఆర్ మరోసారి అన్నారు. ఉమ్మడి పాలనలో ఈ మూడు అంశాల్లో సంపూర్ణ న్యాయం చేయాలనేదే సీఎం కేసీఆర్‌ ప్రధాన లక్ష్యమని, వీటిని రాబట్టేందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటైన 8 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించామని వివరించారు.

హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్లుగా ప్రభుత్వ పథకం అందని ఊరు లేదు. రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఒక్కసారి కాదు 10 ఛాన్స్ లు ఇచ్చారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏమి చేయని అసమర్థ పార్టీ కాంగ్రెస్. బండి సంజయ్ విచిత్రమైన మనిషి. మసీదులు తవ్వుదాం అంటున్నారు. జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పి ఆ హామీని విస్మరించారు. ప్రధాని మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు వాటి ఊసే లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే స్పందించరు. పసుపు బోర్డ్ తెస్తానని బండి సంజయ్ బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నారు.

        – కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఒక అద్భుతమైన పనిని సీఎం కేసీఆర్‌ చేశారని కేటీఆర్ వెల్లడించారు. పట్టణాలు, తండాలు, పంచాయతీలు ఇలా తేడాలు చూపకుండా కోటి ఇళ్లకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీరు అందిస్తున్నామని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నీళ్ల విషయంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి తెలంగాణలో జరగిందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి