Drunken Drive: మద్యం తాగి బండి నడుపుతున్నారా.? అయితే జాగ్రత్త.. భవిష్యత్తులో మళ్లీ వాహనం నడపలేరు.
Drunken Drive Hyderabad: మద్యం తాగి వాహనం నడపడం నేరమనే విషయం తెలిసినా.. కొందరు మందుబాబులు మాత్రం యథేశ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు....

Drunken Drive Hyderabad: మద్యం తాగి వాహనం నడపడం నేరమనే విషయం తెలిసినా.. కొందరు మందుబాబులు మాత్రం యథేశ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రాత్రయిందంటే చాలు ఫుల్లుగా మందు కొట్టి వాహనాన్ని రోడ్లపైకి తెస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. సాధారణంగా ఇప్పటి వరకు ఎవరైనా మద్యం తాగి దొరికితే బండి సీజ్ చేసి.. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేసే వారు. కానీ ఇప్పుడు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు మందుబాబులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికితే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక్క సైబరాబాద్ పరిధిలోనే ఏకంగా 2119 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశారు. గడిచిన ఏడు నెలల వ్యవధిలో 23,868 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికిన 3629 మంది లెసెన్స్‌లను రద్దు చేయాలని సైబరాబాద్ పోలీసులు ఆర్టీఏకు లేఖ రాయాగా.. వీరిలో 21119 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేశారు. ఇక లైసెన్స్ రద్దు అయిన తర్వాత కూడా వాహనం నడిపిన 31 మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే మద్యం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతోంది. దాదాపు 30 శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే జరుగుతున్నాయని గణంకాలు చెబుతున్నాయి. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఈ ఏడాది 802 ప్రమాదాలు జరగగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో 745 మందికి గాయలయ్యాయి. ఇదిలా ఉంటే గతంలో డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లను కేవలం వీకెండ్స్‌లోనే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రతీ రోజూ చేపట్టాలని పోలీసులు నిర్ణయించారు. కాబట్టి ఇకపై మద్యం తాగి వాహనం తీస్తే ఒకటి రెండు సార్లు ఆలోచించండి.. లేదంటే ఇక మీ పని అంతే.
RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?