AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid 19: స్కూల్స్‌లో కరోనా స్వైర విహారం.. కురబలకోటలో 11మందికి పాజిటివ్.. వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులు

బడి గంట మోగింది. మరోవైపు కరోనా మహమ్మారి అదే ఊపుతో విజృంభిస్తోంది. స్కూల్స్‌లో స్టూడెంట్స్‌, టీచర్స్‌ కోవిడ్‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Covid 19: స్కూల్స్‌లో కరోనా స్వైర విహారం.. కురబలకోటలో 11మందికి పాజిటివ్.. వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులు
Balaraju Goud
|

Updated on: Sep 04, 2021 | 9:46 AM

Share

Corona Cases in Schools: బడి గంట మోగింది. మరోవైపు కరోనా మహమ్మారి అదే ఊపుతో విజృంభిస్తోంది. స్కూల్స్‌లో స్టూడెంట్స్‌, టీచర్స్‌ కోవిడ్‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలో కరోనా వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ విద్యాసంస్థలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌‌గా తేలింది. దీంతో వైద్య బృందం వెళ్లి వైద్య సేవలు అందించినట్లు కురబలకోట పీహెచ్‌సీ వైద్యాధికారిణి అనుహ్య తెలిపారు. ఇక్కడ చదువుతున్న 10 మంది విద్యార్థులు, డైనింగ్‌ హాల్‌ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు.

అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వారికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తెలిపారు. కాగా కరోనా సోకిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. స్కూల్ సిబ్బంది , టీచర్స్ సహా అందరికి కోవిడ్‌ టెస్టులు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

Read Also…  Medchal Road Accident: చావులోను ఒక్కటైన స్నేహితులు.. దుండిగల్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?