Medchal Road Accident: చావులోను ఒక్కటైన స్నేహితులు.. దుండిగల్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు.
Dundigal Road Accident: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైకు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతులను సూరారం ప్రాంతానికి చెందిన ప్రమోద్ రెడ్డి, సైనిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతి వేగం, నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.