AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 42 వేలకు పైగా నమోదు

దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గు చోటుచేసుకుంటున్నాయి. తాజా మరోసారి పాజిటివ్ కేసులు తగ్గాయి.

Covid-19 : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 42 వేలకు పైగా నమోదు
Coronavirus Spread
Balaraju Goud
|

Updated on: Sep 04, 2021 | 10:02 AM

Share

India Corona Cases: దేశంలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా హెచ్చు తగ్గు చోటుచేసుకుంటున్నాయి. తాజా మరోసారి పాజిటివ్ కేసులు తగ్గాయి. శుక్రవారం 45 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి 42 వేలకు తగ్గాయి. ఇది నిన్నటికంటే 3.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907కు చేరింది. ఇక, ఇందులో ఇప్పటి వరకు 3,21,00,001 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక, ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 4,40,225 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయారు. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 36,385 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 330 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషనస్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 58 లక్ష మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య తెలిపింది.

కరోనా వైరస్ భారత్ ను మరోసారి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిత్యం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. ఓవైపు వ్యాధి సోకిన వారికి చికిత్స అందిస్తూనే మరోవైపు వైరస్ సోకకుండా జాగ్రత్తలు చెబుతోంది. ఇదిలా ఉండగా అక్టోబర్‌లో భారత్ లో కరోనా థర్డ్ వేవ్ వచ్చేఅవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ స్వామినాథన్ మాత్రం ఎండమిక్ స్టేజీలోకి భారత్ వెళ్లిందని అంటున్నారు.

ఎండమిక్ అంటే ఒక వ్యాధి శాశ్వతంగా మనమధ్యే ఉండిపోవడం. అంటే కరోనా రాకముందు మన మధ్య ఉన్న మశూచి, తట్టూ, హైపటైటిస్-ఎ, హైపటైటిస్-బి లాంటి వ్యాధులు మనుషుల మధ్య ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కరోనా కూడా ఉంటుందని స్వామినాథన్ చెప్పిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. కోవిడ్ ఎలా పుట్టిందో ఎవరూ నిర్దారించలేదు. దీంతో ఇప్పుడు ఆ వైరస్ ఎండమిక్ గా మారే అవకాశం ఉందా..? అని కొందరు వైద్య నిపుణులు అనుమానపడుతున్నారు. పాండమిక్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం. ఎండెమిక్ అంటే జనాల మధ్యే వ్యాధి ఉన్నా మరణించేంతగా ఉండకపోవచ్చని చెబుతున్నారు.కరోనా వైరస్ సోకకుండా ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సిన్లు తీసుకొచ్చాయి. అయితే భారత్ లో వ్యాక్సినేషన్ 15 శాతం మాత్రమే పూర్తయింది. ఒకవేళ వ్యాక్సినేషన్ ఎక్కువగా అయితే వైరస్ ఎండమిక్ గా మారే అవకాశం ఉందని కొందరు వైద్యనిపుణులు తెలుపుతున్నారు.

Read Also…  Actor Haranath: వ్యసనం అలవాటుగా మారితే ఏమవుతుంది.. తొలి తెలుగు అందాల నటుడు హరినాథ్ జీవితమవుతుంది..

Covid 19: స్కూల్స్‌లో కరోనా స్వైర విహారం.. కురబలకోటలో 11మందికి పాజిటివ్.. వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులు