Mu Variant: వణికిస్తున్న ‘మ్యూ వేరియంట్’.. వ్యాక్సిన్లకు లొంగని డేంజర్ వేరియంట్.. 40 దేశాల్లో గుర్తింపు!
Mu Variant: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వైరస్‌ను అరికట్టేందుకు ఎన్నో రకాల చర్యలతో కట్టడిలోకి వచ్చింది...

Mu Variant: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. వైరస్‌ను అరికట్టేందుకు ఎన్నో రకాల చర్యలతో కట్టడిలోకి వచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలున్నాయని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక మొన్న ఆల్ఫా.. నిన్న డెల్టా.. నేడు మ్యూ.. ప్రపంచాన్ని కొవిడ్ వేరియంట్లు పట్టిపీడిస్తున్నాయి. ఈ కొత్త రకాన్ని ‘వేరియంట్ఆఫ్ ఇంట్రెస్ట్’గా గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో కరోనా మ్యూ వేరియంట్ గుర్తించారు పరిశోధకులు. వ్యాక్సిన్లకు లొంగని డేంజర్ వేరియంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కొలంబియాలో బయటపడ్డ మ్యూ వేరియంట్ యూరప్, అమెరికా, బ్రిటన్‌లో కూడా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.
వేరియంట్ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటి?
సాధారణంగా వైరస్‌లు ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతుంటాయి. కొన్నింటిలో మ్యుటేషన్ల కారణంగా వాటి తీవ్రత తగ్గుతుంది. మరికొన్నింటిలో మాత్రం ఉద్ధృతి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ రెండో రకంతో టీకాల సామర్థ్యం కూడా తగ్గే ప్రమాదం ఉంది. కొన్ని పరీక్షల్లో బయటపడవు కూడా. వైరస్ తీవ్రత పెంచే విధంగా మార్పులు జరిగితే దానిని ‘వేరియంట్ఆఫ్ఇంట్రెస్ట్’గా గుర్తిస్తారు. మ్యూ వేరియంట్‌కు ఈ లక్షణాలు చాలానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈటా, లోటా, కప్ప, లాంబ్డా.. ఈ వైరస్ రకాలను కూడా వేరియంట్ఆఫ్ఇంట్రెస్ట్గా పరిగణిస్తున్నారు.
టీకాలు పని చేయవా..?
వైరస్.. స్పైక్ ప్రోటీన్ల సాయంతో మనిషి శరీరంలోని కణాలలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వైరస్‌పై మనిషి రోగ నిరోధక శక్తి పోరాటం చేసే విధంగా వ్యాక్సిన్లను రూపొందించారు. కొత్త వేరియంట్ల వల్ల స్పైక్ ప్రోటీన్లలో మార్పులు జరిగితే టీకా సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. అయితే టీకాల ద్వారా ఉత్పన్నమయ్యే యాంటీబాడీల నుంచి తప్పించుకునే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసింది. దీనిపై పూర్తిస్తాయి పరిశోధనలు చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
వైరస్‌కు టీకా ఒక్కటే పరష్కారమా..?
టీకాల సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశముంది. ఇది ఎప్పుడు జరుగుతుందనేది కచ్చితంగా చెప్పడం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే టీకా అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండటం కొంత ఉపశమనం ఇచ్చే విషయమే. డెల్టా వంటి వేరియంట్ల కోసం పలు సంస్థలు ఇప్పటికే టీకాలను రూపొందిస్తున్నాయి. కొత్త వేరియంట్‌కు తగ్గట్టుగా 6-8 వారాల్లో టీకాలు మార్చుకునే సామర్థ్యం తయారీ సంస్థలకు ఉంది.
కాగా, ప్రపంచంలో ముందు కోవిడ్ బయటపడింది. ఆ తర్వాత దానికంటే 50 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న ఆల్ఫా పుట్టుకొచ్చింది. ఆల్ఫా కన్నా 50 శాతం ప్రమాదకరమైన డెల్టా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. మున్ముందు, డెల్టా కన్నా ప్రమాదకరమైన వేరియంట్రావడంలో సందేహం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్‌పై పోరాడాలంటే టీకాలే కీలకమని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎక్కువ మందికి టీకాలు వేసినట్లయితే వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకురావడం తగ్గుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
Read Also: Covid-19 : దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 42 వేలకు పైగా నమోదు
డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..