చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2021 | 12:13 PM

‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ 13వ సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. మొదలైన వారం రోజులకే ఒకమ్మాయి కోటి రూపాయలు గెల్చుకుంది. గతంలోనూ చాలామంది గెల్చుకున్నారు. కొత్తేముంది? అనుకుంటున్నారా! ఆమెకు కళ్లు సరిగా కనిపించవు. హిమానీ బుందేలా ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారు.

‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ 13వ సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. మొదలైన వారం రోజులకే ఒకమ్మాయి కోటి రూపాయలు గెల్చుకుంది. గతంలోనూ చాలామంది గెల్చుకున్నారు. కొత్తేముంది? అనుకుంటున్నారా! ఆమెకు కళ్లు సరిగా కనిపించవు. హిమానీ బుందేలా ఈ సీజన్‌లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారు. హిమానీ బుందేలాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా. తండ్రి చిరు వ్యాపారి. తల్లి గృహిణి. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. ఇంటర్‌లో ట్యూషన్‌కి వెళుతుండగా బైక్‌ ఆమెను ఢీకొంది. కాళ్లూ చేతులకు బాగా దెబ్బలు తగిలాయి. ఎముకలేమీ విరగలేదు. దీంతో డాక్టర్‌ దెబ్బలకు కట్లు కట్టి పంపించేశారు. కొన్నిరోజులకు ఆమె తన కళ్లు మసకబారుతుండటం గమనించింది. హాస్పిటల్‌కి వెళితే ‘రెటీనా పక్కకు తొలిగింది, రెండు రోజుల్లో ఆపరేషన్‌ చేయకపోతే చూపు పోయే ప్రమాదం ఉంద’న్నారు. ఎనిమిది నెలల్లో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మూడో సర్జరీ వరకూ రంగులు సహా స్పష్టంగా చూడగలిగేది. నాలుగో ఆపరేషన్‌ నుంచి పూర్తిగా చూడలేకపోయింది. ఇప్పటికీ వెలుతురు, చీకటి తప్ప ఏమీ గుర్తుపట్టలేదు.

కానీ.. తనేమీ కుంగిపోలేదు. లెక్కలంటే ఇష్టం. వాటినే సాధన చేసేది. చిన్నతరగతుల పిల్లలకు మెంటల్‌ మ్యాథ్స్‌ బోధిస్తోంది. ఆగ్రాలోని కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా చేస్తోంది. కేబీసీ మీద ఉన్న ఆసక్తితో ప్రయత్నించింది. ‘వెళ్లాలన్న తపన ఉంది. కానీ.. మిగతా వాళ్లు నన్నెలా చూస్తారోనన్న భయం ఉండేది. జాలి చూపిస్తారా, తమతో సమానంగా చూస్తారా అన్న సందేహముండేది. పైగా వాళ్లు కంప్యూటర్స్‌ వాడటంలో నాకంటే వేగంగా, ముందుగా ఉంటారు. పోటీ పడగలనా అనుకున్నా. కానీ అందరూ నాతో గౌరవంగా వ్యవహరించారు. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని వివరించింది 25 ఏళ్ల హిమానీ. చిరునవ్వుతో, ఉత్సాహంగా ఉన్న ఆమెను అమితాబ్‌ ఓ ప్రశ్న అడిగారు. ‘కళ్లు కనిపించకపోయినా ఇంత ఉత్సాహంగా ఎలా?’ అని. ‘జీవితాన్ని సానుకూలంగా తీసుకుంటే ఆనందంతోపాటు విజయాలూ దక్కుతాయి’ అంటోంది హిమానీ.

మరిన్ని ఇక్కడ చూడండి: బంగారు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఓ సినిమా…! నయన్ ముందుగా పిలిచే పేరే సినిమా టైటిల్..(వీడియో): Nayanthara Video.

మిలిట్రీ శునకాలను అఫ్గాన్‌లోనే వదిలిన అమెరికాపై ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!(వీడియో): US Military Dogs.

తెనేటీగాల మురిపిస్తున్న బుల్‌డాగ్‌.. మరిన్ని రంగు రంగుల దుస్తుల్లో బుజ్జి కుక్కపిల్ల..: Dog Viral Video.

News Watch : ‘నమో’ యాదాద్రి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )