బంగారు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఓ సినిమా…! నయన్ ముందుగా పిలిచే పేరే సినిమా టైటిల్..(వీడియో): Nayanthara Video.

లేడీ సూపర్‌స్టార్ నయనతార తమిళ్, తెలుగు ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. తన మాతృభాష మలయాళ సినీ ఇండస్ట్రీపై మాత్రం ఆసక్తిని వదులుకోరు. మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంటారు. తమిళ్, తెలుగు సినిమాలతో కోట్లాది రూపాయల రెన్యుమరేషన్ తీసుకుంటుంది నయన్.

లేడీ సూపర్‌స్టార్ నయనతార తమిళ్, తెలుగు ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నా.. తన మాతృభాష మలయాళ సినీ ఇండస్ట్రీపై మాత్రం ఆసక్తిని వదులుకోరు. మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంటారు. తమిళ్, తెలుగు సినిమాలతో కోట్లాది రూపాయల రెన్యుమరేషన్ తీసుకుంటున్నారు నయన్. అయితే మలయాళ సినిమాల్లో మాత్రం చాలా తక్కువే పారితోషికం తీసుకుంటారట. మలయాళ సినిమాల్లో తన పాత్ర నచ్చితే చాలు.. పారితోషికం విషయాన్ని పెద్దగా పట్టించుకోరు నయనతార. దీనికి కారణం మలయాళ సినిమాలు చాలా వరకు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించడమే. భారీ పారితోషికం ఆశిస్తూ తన సొంత రాష్ట్రంలోని ఫ్యాన్స్‌కు దూరం కాకూడదన్న ఆలోచనతోనే నయన్… ఇలా తక్కువ పారితోషికానికే మలయాళ సినిమాలు చేస్తుంటారనే టాక్‌ కూడా ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా నయనతార మరో మలయాళం చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘గోల్డ్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ఇందులో పృథ్వీరాజ్‌ హీరోగా నటించనున్నారు. ప్రేమమ్ తదితర హిట్స్ మూవీస్ అందించిన అల్ఫోన్స్‌ పుత్రెన్‌ దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ నెలలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఫస్ట్‌ షెడ్యూల్‌లోనే నయనతార ‘గోల్డ్‌’ సినిమా సెట్స్‌లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.కాబోయే భర్త విఘ్నేష్ శివన్ నయనతారను ముద్దుగా ‘తంగమ్’ అని పిలుస్తారట. అందుకే ఈ సినిమాకు గోల్డ్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు మరో టాక్ ఇండస్ట్రీలో వైరల్గా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి: మిలిట్రీ శునకాలను అఫ్గాన్‌లోనే వదిలిన అమెరికాపై ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!(వీడియో): US Military Dogs.

తెనేటీగాల మురిపిస్తున్న బుల్‌డాగ్‌.. మరిన్ని రంగు రంగుల దుస్తుల్లో బుజ్జి కుక్కపిల్ల..: Dog Viral Video.

News Watch : ‘నమో’ యాదాద్రి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

ఉక్కిరిబిక్కిరైన ఛార్మి..ఈడీ నోటీసు బట్టబయలు..(వీడియో): Charmy In Tollywood Drugs Case Video.

Click on your DTH Provider to Add TV9 Telugu