మిలిట్రీ శునకాలను అఫ్గాన్‌లోనే వదిలిన అమెరికాపై ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు..!(వీడియో): US Military Dogs.

తొందరపాటులో మిలిట్రీ కుక్కల్ని అఫ్గాన్‌లోనే వదిలేసి వెళ్ళింది అమెరికా. భారత్‌ మాత్రం మాయా, రూబీ, బాబీని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌ దళాలు ఆ శునకాలను భద్రంగా భారత్‌కు చేర్చాయి. ఈ రెండు అంశాలను పోలుస్తూ..

తొందరపాటులో మిలిట్రీ కుక్కల్ని అఫ్గాన్‌లోనే వదిలేసి వెళ్ళింది అమెరికా. భారత్‌ మాత్రం మాయా, రూబీ, బాబీని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌ దళాలు ఆ శునకాలను భద్రంగా భారత్‌కు చేర్చాయి. ఈ రెండు అంశాలను పోలుస్తూ.. నెటిజన్లు అమెరికా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అమెరికా సైనికులు అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా విడిచి వెళ్ళిపోయారు. సమయం లేని కారణంగా ఇంకా 200 మంది అమెరికన్లతో పాటు దేశం వీడాలనుకున్న అఫ్గాన్ పౌరులను అమెరికా తరలించలేకపోయింది. తొందరపాటులో తమకు సేవలందించిన సర్వీసు శునకాలను కూడా అఫ్గాన్‌లోనే వదిలేసి వెళ్లారు. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు ఆగస్టు 31న పూర్తిగా వైదొలిగాయి. అయితే శునకాలను అక్కడే వదిలిరావడంపై విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ఆ జాగిలాలను ‘వెటరన్ షీప్ డాగ్స్ ఆఫ్ అమెరికా’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ అగ్రరాజ్యానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం కాబుల్ లో వాటి బాగోగుల్ని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌ మాత్రం అఫ్గాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన మాయా, రూబీ, బాబీ అనే జాగిలాలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. ఇండో టిబెటన్‌ బోర్డర్ పోలీస్‌ దళాలు ఆ శునకాలను భద్రంగా భారత్‌కు చేర్చాయి. ఈ రెండు అంశాలను పోలుస్తూ.. నెటిజన్లు అమెరికా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తమ పౌరులను అమెరికాకు తరలించలేకపోవడంపై ఆ దేఅ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ స్పందించారు. అఫ్గాన్‌లో ఉండిపోయిన అమెరికా పౌరులను తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన అమెరికన్లకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: తెనేటీగాల మురిపిస్తున్న బుల్‌డాగ్‌.. మరిన్ని రంగు రంగుల దుస్తుల్లో బుజ్జి కుక్కపిల్ల..: Dog Viral Video.

News Watch : ‘నమో’ యాదాద్రి..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

ఉక్కిరిబిక్కిరైన ఛార్మి..ఈడీ నోటీసు బట్టబయలు..(వీడియో): Charmy In Tollywood Drugs Case Video.

సర్ ప్రైజ్ అండ్ ఎక్సయిటింగ్ న్యూస్.. కోచ్ గా ధోని.. (వీడియో): MS Dhoni as Coach Video.

Click on your DTH Provider to Add TV9 Telugu