Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయుధాలు వీడే ప్రసక్తే లేదు..! పంజ్‌షేర్‌ ఫైటర్లతో తాలిబన్ల చర్చలు విఫలం: Panjshir and Taliban Video.

ఆయుధాలు వీడే ప్రసక్తే లేదు..! పంజ్‌షేర్‌ ఫైటర్లతో తాలిబన్ల చర్చలు విఫలం: Panjshir and Taliban Video.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2021 | 2:31 PM

పంజ్‌షేర్‌ను ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. పంజ్‌షేర్‌పై ఇటీవల దాడికి కూడా దిగారు. ఎదురుదెబ్బ తగిలి దాదాపు 350 మంది తాలిబన్‌ ముఠా సభ్యులు పంజ్‌షేర్‌ ఫైటర్లు చేతుల్లో ప్రాణాలొదిరారు. తాజాగా రెండు వర్గాలు చర్చల బాట పట్టారు. అయితే...

పంజ్‌షేర్‌ను ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. పంజ్‌షేర్‌పై ఇటీవల దాడికి కూడా దిగారు. ఎదురుదెబ్బ తగిలి దాదాపు 350 మంది తాలిబన్‌ ముఠా సభ్యులు పంజ్‌షేర్‌ ఫైటర్లు చేతుల్లో ప్రాణాలొదిరారు. తాజాగా రెండు వర్గాలు చర్చల బాట పట్టారు. అయితే తాలిబన్ల చర్చలు విఫలమయ్యాయి. అఫ్గానిస్థాన్‌లో తమకు ఇప్పటికీ కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్‌షేర్‌ను ఎలాగైనాసరే ఆక్రమించుకోవాలని తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. పంజ్‌షేర్‌పై ఇటీవల దాడికి కూడా దిగారు. ఎదురుదెబ్బ తగలడంతో.. తాజాగా చర్చల బాట పట్టారు. పర్వాన్‌ ప్రాంతంలో పంజ్‌షేర్‌ నేతలు, గిరిజన తెగల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఆయుధాలు వీడి తమతో చేతులు కలపాలని పంజ్‌షేర్‌ ఫైటర్లకు విజ్ఞప్తి చేశారు.

అయితే తాలిబన్ల చర్చలు విఫలమయ్యాయి. తాలిబన్‌ అధికార ప్రతినిధి ముల్లా ఆమిర్‌ ఖాన్‌ ముత్తా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు- అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు తాము దాదాపు 350 మంది తాలిబన్‌ ముఠా సభ్యులను హతమార్చినట్లు పంజ్‌షేర్‌ ఫైటర్లు ప్రకటించారు. మరో 40 మందిని బంధించినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్న 8ఏళ్ల బాలుడు.. వైరల్ వీడియో..: 8 Years Boy Ride Auto Video.

తల స్నానానికి అష్టకష్టాలు..! వ్యోమగాములు తల స్నానం ఎలా చేస్తారో తెలుసా.? వైరల్‌ వీడియో..! :Astronauts Wash Hair Video.

చూపు కోల్పోయినా కోటి ఎలా గెల్చుకుంది..?KBC లో cr.1 విన్నర్..: KBC 1 crore Winner Blind Girl Video.

బంగారు బాయ్‌ ఫ్రెండ్‌ కోసం ఓ సినిమా…! నయన్ ముందుగా పిలిచే పేరే సినిమా టైటిల్..(వీడియో): Nayanthara Video.