RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?

RBI Penalty: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. దేశంలో..

RBI Penalty: మరో రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా.. కస్టమర్ల పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా..?
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2021 | 9:25 AM

RBI Penalty: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులకు భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. దేశంలో ఇప్పటికే ఎన్నో బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ.. తాజాగా మరో రెండు బ్యాంకులకు పెనాల్టీ విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన ముంబై మెర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. అలాగే మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న సెంట్రల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్ కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.2 లక్షల జరిమానా విధించింది. అయితే బ్యాంకులకు జరిమానా విధించడం వల్ల కస్టమర్ల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావితం చేయదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సహకార బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేటు, 2016, ఫ్రేమ్‌ వర్క్‌ కింద ఆదేశాలు పాటించనందున ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ కోల్‌కతాలోని విలేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు కేవైసీ నిబంధనలు పాటించనందున రూ.5 లక్షల జరిమానా విధించింది. అహ్మద్‌నగర్‌ మర్చంట్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.13 లక్షలు, అహ్మదాబాద్‌లోని మహిళా వికాస్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.2 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.

ఈ రెండు బ్యాంకులకు రూ.53 లక్షలకుపైగా జరిమానా..

గత నెలలో ఆర్బీఐ నాసిక్‌లోని జనలక్ష్మి కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.5.35 లక్షలు జరిమానా విధించగా, ఘజియాబాద్‌లోని నోయిడా కమర్షియల్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకుకు రూ.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపింది. నాసిక్‌లోని జనలక్ష్మి కో-ఆపరేటివ్‌ బ్యాంకు నిబంధనలు పాటించనందున జరిమానా విధించినట్లు తెలిపింది. అలాగే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీల సభ్యత్వంపై రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసిన ఆదేశాలను పాటించనందున జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

ఇవీ కూడా చదవండి:

Insurance Policy: మీకు మద్యం తాగే అలవాటు ఉండి బీమా పాలసీ తీసుకుంటున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్