Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?

Low CIBIL Score: ప్రస్తుతం ఉన్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌కార్డులను వాడుకుంటూ సరైన సమయానికి చెల్లిస్తుంటే మంచి సిబిల్‌ స్కోర్‌..

Low CIBIL Score: సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే లోన్‌ పొందడం ఎలా..? రుణంకు స్కోర్‌కు సంబంధం ఏమిటి..?
Low Cibil Score
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2021 | 7:36 AM

Low CIBIL Score: ప్రస్తుతం ఉన్న రోజుల్లో క్రెడిట్‌ కార్డులు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. క్రెడిట్‌కార్డులను వాడుకుంటూ సరైన సమయానికి చెల్లిస్తుంటే మంచి సిబిల్‌ స్కోర్‌ ఉంటుంది. లేకపోతే తగ్గుతుంది. దీంతో స్కోర్‌ ప్రభావం రుణాలు తీసుకునే సమయంలో పడుతుంది. ఏదైనా ఖరీదైన ఆస్తులు, వస్తువులు, వాహనాలు కొనాలంటే రుణం తీసుకోవడం తప్పనిసరి. మరి రుణం మంజూరు కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. అందులో సిబిల్‌ స్కోర్‌ ముఖ్యమైనది. అయితే, అనివార్య కారణాల వల్ల కొన్నిసార్లు సిబిల్‌ తగ్గుతుంటుంది. తెలిసో, తెలియకో చేసిన పొరపాట్లు సిబిల్‌ స్కోర్‌ పడిపోతుంటుంది. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితి ఉంటే పర్సనల్‌ లోన్ తీసుకోవడంలో ఇబ్బందిగా మారుతుంటుంది. మరి సిబిల్‌ స్కోర్‌ తగ్గితే లోన్‌ పొందడం ఎలా..?

మంచి సిబిల్‌ స్కోర్‌ అంటే ఎంత?

సిబిల్‌ స్కోరును క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ (సిబిల్‌) నిర్వహిస్తుంది. వ్యక్తి రుణ చరిత్ర ఆధారంగా దీన్ని లెక్కిస్తారు. పలు అంశాలను, ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటారు. సాధారణంగా సిబిల్‌ 1000కి గానూ 550 కంటే ఎక్కువ ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే రుణం మంజూరులో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఒక్కోసారి అంతకంటే తక్కువ ఉన్నా రుణం మంజూరు చేస్తారు. కానీ, వడ్డీరేటు ఎక్కువ ఉంటుంది. లేదా మంజూరు చేసే మొత్తం మన అవసరానికి సరిపోకపోవచ్చు.

సిబిల్‌ స్కోర్‌కు లోన్‌కు సంబంధం ఏమిటి..?

బ్యాంకులకు రుణగ్రహీతలను అంచనా వేయడానికి ఉపయోగపడే కీలక సాధనం సిబిల్‌ స్కోర్‌. స్కోర్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత సులభంగా రుణం మంజూరవుతుంది. సిబిల్‌ స్కోర్‌ మన రుణ చరిత్రను ప్రతిబింబిస్తుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల వంటి ఆర్థిక లావాదేవీలను ఈ స్కోరు సూచిస్తుంది. మీ బ్యాంకుల ఖాతాల నిర్వహణను కూడా దీన్ని బట్టి అంచనా వేయవచ్చు. తద్వారా ఆర్థిక అంశాలపై మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో తెలిసిపోతుంది.

వ్యక్తిగత రుణం ఎలాంటి తనఖా లేకుండానే ఇచ్చే అన్‌సెక్యూర్డ్‌ రుణం. అలాంటప్పుడు సిబిల్‌ స్కోరే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ స్కోర్‌ తక్కువగా ఉంటే వ్యక్తగత రుణం పొందడం కొంత సవాల్‌తో కూడుకున్నదనే చెప్పాలి. ఒకవేళ ఇచ్చినా.. మనం అడిగిన దాని కంటే తక్కువ రుణం ఇవ్వడం, ఎక్కువ వడ్డీరేటు, తక్కువ కాలపరిమితితో కూడిన రుణాన్ని మంజూరు చేస్తాయి బ్యాంకులు. అయితే, కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు రూ.10,000-50,000 వరకు రుణాన్ని ఇస్తున్నాయి. సిబిల్‌ స్కోర్‌ విషయంలో పెద్దగా పట్టించుకోవు. సిబిల్‌కి బదులుగా ఈ సంస్థలు మన మొబైల్‌కి ఎస్‌ఎంఎస్‌ రూపంలో వచ్చే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అంచనా వేస్తాయి. కొన్ని ఫిన్‌టెక్‌లైతే.. ప్రత్యేకంగా సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉన్నవాళ్లకే రుణాలు అందిస్తున్నాయి.

సిబిల్‌ స్కోర్‌ను మెరుగు పర్చుకోవాలంటే..

సిబిల్‌ స్కోర్‌ తక్కువ ఉండి, రుణం తప్పనిసరైతే.. డిజిటల్‌ రుణ సంస్థలను ఆశ్రయించడం మేలంటున్నారు ఆర్థిక నిపుణులు. వీటి నుంచి తీసుకొని సకాలంలో చెల్లిస్తే మీ సిబిల్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. తొలిసారి రుణం తీసుకుంటున్నవారు లేదా తక్కువ సిబిల్‌ స్కోర్‌ ఉన్నవారికి రుణం ఇవ్వడానికి సాధారణ బ్యాంకులు ఆసక్తి చూపవు. అలాంటి సందర్భంలో డిజిటల్‌ లెండర్ల నుంచి రుణం తీసుకొని సక్రమంగా చెల్లిస్తే.. మన సిబిల్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే, వీలైనంత వరకు తక్కువ మొత్తంలో రుణం తీసుకొని ఎప్పటికప్పుడు చెల్లించడం ఉపయోగకరంగా ఉంటుంది.

రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ మీ క్రెడిట్‌ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి. ఎక్కువ సార్లు రుణం తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ కొద్దిగా తగ్గుతుంది. రుణదాతలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారని ఇది సూచిస్తుంది. ఇవీ కూడా చదవండి:

HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా?.. క్షణాల్లోనే లోన్‌ మంజూరు.. చెక్‌ చేసుకోండిలా!

Doorstep Banking: ఎస్‌బీఐ డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌.. ఇంటి వద్దనే రూ.20 వేల వరకు పొందవచ్చు

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?