Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. 14 నుంచి 28వ తేదీ వరకు ఆ రూట్స్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.

కొత్తగూడ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌, అండర్‌ పాస్‌ నిర్మాణాలు జరుగుతోన్న తరుణంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. డిసెంబర్‌ 14 వ తేదీ నుంచి 88వ తేదీన వరకు ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటుందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా..

Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్‌.. 14 నుంచి 28వ తేదీ వరకు ఆ రూట్స్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.
Hyderabad Traffic Restrictiion
Follow us

|

Updated on: Dec 14, 2022 | 4:07 PM

కొత్తగూడ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌, అండర్‌ పాస్‌ నిర్మాణాలు జరుగుతోన్న తరుణంలో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. డిసెంబర్‌ 14 వ తేదీ నుంచి 88వ తేదీన వరకు ట్రాఫిక్‌ డైవర్షన్‌ ఉంటుందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా సైబర్ టవర్స్‌ నుంచి వయా సీఐఐ జంక్షన్‌ మీదుగా కొత్తగూడ వెళ్లే వాహనాలను అనుమతించరు. ఈ దారి గుండా వెళ్లాలనుకునే వారు హైటెక్స్‌ కామన్‌ నుంచి ఆపర్ణ హైట్స్‌- కొండపూర్ జంక్షన్‌, కొత్త గూడ జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక సీఐఐ జంక్షన్‌ను కొత్తగూడ, ఎఎమ్‌బీ మాల్‌, మసీద్‌ బండ, గచ్చిబౌలి వెళ్లేవారిని రామాలయం – వైట్‌ ఫీల్డ్స్‌ రోడ్స్‌ – బొటానికల్‌ గార్డెన్‌, కొత్తగూడ జంక్షన్‌ మీదుగా అనుమతించనున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారంగా స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్‌డీపీ) ప్రోగ్రాం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా ఇప్పటికే పలు ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా 18వ ఫ్లై ఓవర్‌ కొత్తగూడలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. రూ. 263.09 కోట్లతో మూడు కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ వంతెన 98శాతం పనులు పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోంది.

ఇందులో భాగంగానే ఫ్లై ఓవర్‌ పనులను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు. మిగిలన పనులను త్వరగా పూర్తి చేసి జనవరి 1న నగరవాసులకు బహుమతిగా ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే.. గచ్చిబౌలి నుంచి మియాపూర్‌ వరకు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌సిటీ ప్రాంతం మధ్య ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పడుతుంది. దీంతో బొటానికల్‌ గార్డెన్‌ జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్‌, కొండాపూర్ జంక్షనల్లో ట్రాఫిక్‌ సమస్యకు విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..