Hyderabad: మహా నగరంలో తాగునీటి మరణాలు.. ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం..
హైదరాబాద్ మహా నగరంలో తాగునీరు కలుషితం అవుతోందా? నగరవాసుల ప్రాణాలు తీస్తోందా..? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవులపల్లిలో ఆఫ్రీన్ సుల్తానా అనే 22 ఏళ్ల మహిళ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. మహ్మద్ ఖైసర్ అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. కలుషిత నీరు తాగడమే వీళ్లిద్దరి మృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కలుషిత నీరు తాగి మరణాలు. ఇద్దరి ప్రాణం పోవడానికి తాగునీరే కారణమని స్థానికుల ఆరోపణ. ఇది ఎక్కడో, మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో కాదు. హైదరాబాద్ మహా నగరంలో. గ్రేటర్ సిటీలో వాటర్ కలుషితం అవుతోందా? హైదరాబాద్‌లోని మైలార్ దేవులపల్లిలో ఆఫ్రీన్ సుల్తానా అనే 22 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మహ్మద్ ఖైసర్ అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. కలుషిత నీరు తాగడమే వీళ్లిద్దరి మృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే ప్రాంతంలో అజహరుద్దీన్, సమ్రీన్ బేగం, RP సింగ్, షహజాది బేగం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అంతే కాకుండా రెండేళ్ల వయసున్న ఇత్తెషాముద్దీన్, ఇఖ్రాబేగం కూడా అనారోగ్యం పాలయ్యారు. మృతి చెందిన ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ చిన్నారి వయస్సు 6 నెలలు.
వాళ్లిద్దరి మరణాలకే కాకుండా.. మిగిలిన వాళ్లు ఆస్పత్రి పాలు కావడానికి కలుషిత నీరే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాగు నీరు కలుషితమైందని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే స్థానికుల ఆరోపణ.
అధికారుల వర్షెన్ మరోలా..
మొఘల్ కాలనీలో కలుషిత నీరు సప్లై అవుతోందని.. ఇటీవల రెండు ఫిర్యాదులు అందాయి. వాటిపై చర్యలు తీసుకున్నామని జలమండలి చెప్తోంది. ఇప్పుడు జరిగిన ఘటనలకు కారణాలు ఏంటనే దానిపై విచారణ చేస్తున్నామంటున్నారు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం