Hyderabad: పొద్దున్నే స్కూల్‌కి వెళ్లగానే అక్కడి దృశ్యం చూసి పిల్లల పరుగులు.. ఒళ్లు గగుర్పొడిచేలా
ప్రపంచం కరోనా వైరస్‌తో పోరాడుతుంటే.. కొంతమంది ఇంకా మంత్రాలతో చింతకాయలు రాల్చాలని చూస్తున్నారు. ఇది ఆ స్కూల్‌కి బ్యాడ్ నేమ్ తేవాలని తెచ్చిన స్టంటో లేక నిజంగానే క్షద్రపూజో తెలీదు.
క్షుద్రపూజల పేరు చెప్పగానే ఏ పురాతన ఆలయం దగ్గరో.. ఎవరికీ కనిపించని మారుమూల ప్రాంతలోనో జరుగుతాయని భావిస్తాం.. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం ఏకంగా స్కూల్లోనే క్షుద్ర పూజలు చేశారు. అది కూడా గుమ్మం ముందే .. దీంతో ఆ ప్రాంతవాసులంతా భయాందోళన చెందుతున్నారు.
రాజేంద్రనగర్‌లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. హైదర్‌షాకోట్‌లోని జడ్పీహెచ్‌ఎస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, స్టోర్ రూం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మలు కనిపించాయి. ఇది చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలలో సీసీ కెమెరాలు కూడా మాయమయ్యాయి.
మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పిల్లలు చదువుకునే పాఠశాలలో ఇలాంటి పూజలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. క్షుద్రపూజలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు స్థానికులు. రాకెట్ యుగంలోనూ గ్రామాల్లో ఇలాంటి ఘటనలు వెలుగుచూడడం ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలకు అద్దం పడుతోంది. ఓం క్రీం బ్రీం.. ఆవాహయామి అంటూ జరిపే ఇలాంటి పూజలతో నిజంగా కోరికలు నేరవేరవని.. పైగా టైం వేస్ట్ అవుతుందని క్షుద్రపూజలను నమ్మే జనం అనుకునే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం