Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: డేటింగ్‌ యాప్‌ లింక్ నొక్కాడు.. ఇద్దరమ్మాయిలు లైన్లోకి వచ్చారు.. ఆ తర్వాత నగ్న చిత్రాలతో..

గురుడు.. ఫోన్‌కు వచ్చిన ఓ లింకుపై క్లిక్ ఇచ్చాడు. ఒకరి తర్వాత.. మరొకరుగా.. ఇద్దరు అమ్మాయిలు లైన్‌లోకి వచ్చారు. 'లడ్డు కావాలా నాయనా..? మరొక లడ్డు కావాలా..? అంటూ ఇద్దరూ కవ్వించారు..

Cyber Crime: డేటింగ్‌ యాప్‌ లింక్ నొక్కాడు.. ఇద్దరమ్మాయిలు లైన్లోకి వచ్చారు.. ఆ తర్వాత నగ్న చిత్రాలతో..
Dating App
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 05, 2022 | 3:59 PM

Online Dating app: డేటింగ్ చేస్తారా..? మీకు కావాలసిన జోడి దొరుకుతుంది.. అంటూ ఫోన్‌లో డేటింగ్ యాప్ లింక్ వచ్చింది.. ఏంటో దీని సంగతి చూద్దామనుకొని అతను కూడా.. ఓ క్లిక్ ఇచ్చాడు. ఒకరి తర్వాత.. మరొకరుగా.. ఇద్దరు అమ్మాయిలు లైన్‌లోకి వచ్చారు. ‘లడ్డు కావాలా నాయనా..? మరొక లడ్డు కావాలా..?’ ఈ యాడ్‌లోని వ్యక్తి మాదిరిగా మనొడు కూడా జాక్‌పాట్ తగిలిందనుకొని.. పులిహార కలిపాడు. ఇంకేముంది.. ఆ తర్వాత వ్యక్తిగత విషయాలు, రొమాంటిక్ మాటలు.. హద్దుమీరిన వ్యవహారం.. ఎంతగా అంటే నగ్న చిత్రాలు షేర్ చేసుకునే వరకు వెళ్లింది. ఇక, సీన్ కట్ చేస్తే గురిడి ఫ్యూజులు ఒక్కసారిగా ఔటయ్యాయి. ఎందుకో ఈ స్టోరీ చదవండి.. డేటింగ్‌ యాప్‌ లింక్ క్లిక్ చేసిన పాపానికి ఓ ప్రైవేటు ఉద్యోగి రెండేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. మాటలతో నమ్మించి అతని నగ్న చిత్రాలు సేకరించిన సైబర్‌ నేరగాళ్లు అతని నుంచి రూ.2.18 లక్షలు కాజేశారు. ఇంకా అతని ఫోన్ నంబర్‌ను వ్యభిచార వెబ్‌సైట్లలో ఉంచడంతో కంగుతిన్న బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

సైబరాబాద్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్‌లోని మయూర్‌నగర్‌లో ఉండే ఓ వ్యక్తి (32) 2020 ఆగస్టులో ఆన్‌లైన్‌లో లొకాంటో పేరుతో ఉన్న డేటింగ్‌ యాప్‌ లింక్ క్లిక్ చేశాడు. ఆ తర్వాత శృతి పేరుతో సైబర్‌ నేరగాళ్లు అతనితో చాటింగ్‌ చేశారు. ఈ క్రమంలో మోక్ష పేరుతో మరో చాటింగ్ చేశారు. ఇలా శృతి, మోక్ష పేర్లతో అతనిని మభ్యపెట్టి నగ్నచిత్రాలు సేకరించారు. అనంతరం అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్నచిత్రాల స్క్రీన్‌ షాట్లు భార్య, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని, నేరుగా ఇంటికొస్తామంటూ ఫోన్లు చేసి బ్లాక్‌మెయిల్‌ చేశారు. ప్రతిసారీ కొత్త నంబరు నుంచి ఫోన్‌ చేసి కుటుంబాన్ని చంపేస్తామంటూ భయపెట్టారు. దీంతో అతను చాలాసార్లు వారికి డబ్బులు పంపాడు. ఇలా 70-100 వేర్వేరు నంబర్లతో వేధించారు. అంతటితో ఆగకుండా.. అతని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి స్నేహితుల ఫోన్‌ నంబర్లు, ఇతర వివరాలు సేకరించి వారికి కూడా బాధితుడి వ్యక్తిగత సమాచారాన్ని పంపారు. అతని ఫోన్‌ నంబరును వ్యభిచారానికి సంబంధించిన వెబ్‌సైట్లలో కూడా ఉంచారు.

ఇదే ఆసరాగా చేసుకున్న సైబర్ నిందితులు.. లోన్‌యాప్‌ల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ ఫోన్‌ చేసి డిమాండ్‌ చేశారు. ఇలా రెండేళ్లలో పలు ఖాతాల నుంచి మొత్తం రూ.2.18 లక్షలు కాజేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..