TS govt Jobs 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్! ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. కారణం ఇదే..
సర్కార్ కొలువులకు సంబంధించిన పలు నోటిఫికేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 27న..
TSPSC cancelled AMVI Recruitment 2022 Notification: సర్కార్ కొలువులకు సంబంధించిన పలు నోటిఫికేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా శాఖల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 27న రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ప్రకటించింది. ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయంలో అభ్యర్థుల నుంచి భారీఎత్తున టీఎస్పీఎస్సీకి విజ్ఞప్తులు వచ్చాయి. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి హెవీ మోటారు వాహన లైసెన్సు ఉండాలన్న నిబంధన ఉండటంతో, లైసెన్స్ పొందని వారు తాము అనర్హులమవుతామని వాపోయారు. దీనితోపాటు మహిళా అభ్యర్ధులకు కూడా లైసెన్స్ ఉండాలనే విషమాన్ని కూడా అభ్యర్థులకు తెలియజేయలేదు. దీంతో విద్యార్హతలు మార్చేందుకు కొంత సమయం కావాలని కమిషన్‌ను రవాణా శాఖ కోరింది. జులై 2022 ఏఎమ్‌వీఐ నోటిఫికేషన్‌ను రర్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు.