Hyderabad Crime News: అమ్మాయిల వీడియోలు తీయడానికి ప్రయత్నించిన యువకుడు మృతి
అమ్మాయిల వీడియో తీసి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ఒక భవనంపైనుంచి మరో భవనంపైకి దూకేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి..
Hyderabad Man falls from building: అమ్మాయిల వీడియో తీసి తప్పించుకునే క్రమంలో ఓ యువకుడు ఒక భవనంపైనుంచి మరో భవనంపైకి దూకేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. హిమాయత్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల దిలీప్, అతని స్నేహితుడు సాయితేజ శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించారు. అనంతరం సాయితేజ నిద్రకుపక్రమించగా.. రాత్రి 1 గంటల సమయంలో దిలీప్ సిగరెట్ తాగేందుకు భవనంపైకి వెళ్లాడు. అదే భవనం మూడో అంతస్తు ఫ్లాట్‌లో కిటికీ వద్ద చదువుకుంటున్న అమ్మాయిని, పక్కనే పడుకున్న మరో అమ్మాయిని సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం ప్రారంభించాడు. చదువుకుంటున్న యువతి గమనించి తన మిత్రుడు ఉమేష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఉమేష్ మరికొందరితో కలిసి పైకి చేరుకున్నాడు. వీళ్లను గమనించిన దిలీప్ అక్కడినుంచి తప్పించుకునేందుకు ఆ భవనంపైనుంచి పక్కనే ఉన్న మరో భవనంపైకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన దిలీప్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. యువతి మేరకు పోటీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.